Director Shankar : 30 ఏళ్లు పూర్తి చేసుకున్న శంకర్
విలక్షణమైన దర్శకుడిగా పేరు
Director Shankar : తమిళ సినీ రంగంలో మోస్ట్ పాపులర్ దర్శకుడు ఎస్. శంకర్. భారతీయ సినిమా రంగంలో తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ ను స్వంతం చేసుకున్న డైరెక్టర్. ప్రస్తుతం రామ్ చరణ్ తో సినిమా చేస్తున్నాడు. ఆయన సినీ రంగంలోకి ఎంటరై నేటితో 30 ఏళ్లు పూర్తవుతోంది. ఈ సందర్భంగా ఆయనను సినీ రంగానికి చెందిన వారు అభినందనలతో ముంచెత్తుతున్నారు.
Director Shankar Journey
టేకింగ్ లో , మేకింగ్ లో తనకు తనే సాటి. తమిళనాడులోని కుంభకోణంలో ఆగస్టు 17, 1964లో పుట్టాడు ఎస్. శంకర్(Director Shankar). ఆయన వయస్సు ప్రస్తుతం 58 ఏళ్లు. కానీ ఎక్కడా చెక్కు చెదరలేదు. తన పంథా వీడలేదు. సినిమాకు కొత్త సొబగులతో పాటు సాంకేతిక విలువలను జోడించిన అరుదైన ఏకైక దర్శకుడు ఎస్. శంకర్. ఎన్నో విజయవంతమైన సినిమాలు తీశాడు.
తను తీసే ఏ మూవీ అయినా సరే టెక్నికల్ గా టాప్ లో ఉండేలా చూసుకుంటూ వచ్చాడు. 1993లో తమిళ సినీ రంగంలోకి వచ్చాడు. భార్య ఈశ్వరి. ముగ్గురు పిల్లలు. ఓ కూతురు నటిగా ఈ మధ్యే ఎంట్రీ ఇచ్చింది. దక్షిణ భారత దేశంలో అత్యంత విలువైన దర్శకుడిగా గుర్తింపు పొందాడు ఎస్. శంకర్. ఎన్నో అవార్డులు, పురస్కారాలు స్వంతం చేసుకున్నాడు.
రచయిత, దర్శకుడు, నిర్మాత కూడా అయిన శంకర్ 1993లో జెంటిల్ మాన్ తీశాడు. అది సూపర్ హిట్. ఉత్తమ దర్శకుడి పురస్కారం దక్కింది. 1994లో తీసిన ప్రేమికుడు బ్లాక్ బస్టర్. 1996లో విశిష్ట నటుడు కమల్ హాసన్ తో తీసిన భారతీయుడు సెన్సేషన్. 1998లో ఐశ్వర్య రాయ్ తో జీన్స్ తీశాడు. అది క్లాసికల్, కమర్షియల్ హిట్. 1999లో ఒకే ఒక్కడు సూపర్ డూపర్ హిట్. 2001లో నాయక్ తీశాడు. 2004లో ప్రేమిస్తే , 2005లో అపరిచితుడు రికార్డ్ బ్రేక్ చేసింది.
2007లో సూపర్ స్టార్ రజనీకాంత్ తో తీసిన శివాజీ సూపర్ హిట్ గా నిలిచింది. 2009లో వైశాలి తీశాడు. 2010లో రోబో తీశాడు బిగ్ సక్సెస్. 2012లో స్నేహితుడు తీశాడు ఎస్. శంకర్. ప్రస్తుతం రామ్ చరణ్ తో తీస్తున్నాడు. మొత్తంగా శంకర్ కెరీర్ లో 30 ఏళ్లు ముగిశాయన్నమాట.
Also Read : Krishna Priya : నారాయణ, తమ్ముడిపై కృష్ణ ప్రియ ఫిర్యాదు