మ‌న‌సు దోచుకున్న దుల్క‌ర్ స‌ల్మాన్

ఆక‌ట్టుకున్న ఆకాశంలో ఒక తార సినిమా

హైద‌రాబాద్ : రోత క‌థ‌లు, డైలాగులు, బూతు జోకులు, ఆపై ప‌డుతూ లేస్తూ సాగే పాట‌లు, ఏజ్ పెరిగినా అమ్మాయిల‌తో స‌ర‌స స‌ల్లాపాలు ఇవి నేటి తెలుగు సినిమాలు. అయితే టాలీవుడ్ లో అప్పుడ‌ప్పుడు ఫీల్ గుడ్ అనిపించేలా వ‌స్తుంటాయి. ఇక ద‌ర్శ‌కులు, కథా ర‌చ‌యిత‌లు మార‌డం లేదు. ఓ వైపు త‌మిళ , మ‌లయాళ చ‌ల‌న‌చిత్ర ప‌రిశ్ర‌మ‌లు విభిన్న‌మైన క‌థ‌ల‌తో సినిమాలు వ‌స్తున్నాయి. అవార్డుల పంట పండేలా చేస్తున్నాయి. టాలీవుడ్ ఇందుకు భిన్నం. ఇక హీరోల గురించి ఎంత చెప్పినా త‌క్కువే. అవే ముఖాలు..అవే క‌థ‌లు. చూసీ చూసీ విసుగు తెప్పిస్తున్నారు. అయినా జ‌నాల మీద‌కు తోసేస్తున్నారు. కాసుల క‌క్కుర్తి త‌ప్పా హృద‌యాల‌పై చెర‌గ‌ని ముద్ర వేసే సినిమాలు చూద్దామంటే క‌నిపించ‌డం లేదు. తాజాగా గ‌రివిడి లక్ష్మి వ‌చ్చింది. ఇది జాన‌ప‌ద క‌ళాకారిణి బ‌తుకు క‌థ‌. ఇక తాజాగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది ఆకాశంలో ఒక తార సినిమా. ఇందులో కీ రోల్ పోషించాడు దుల్క‌ర్ స‌ల్మాన్. త‌ను సావిత్రి జీవిత క‌థ ఆధారంగా తీసిన మ‌హాన‌టిలో జెమిని గ‌ణేశ‌న్ పాత్ర‌కు జీవం పోశాడు. క‌న్నీళ్లు తెప్పించాడు.

ఇక దుల్కర్ సల్మాన్ గురించి ఎంత చెప్పినా త‌క్కువే. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అత్యంత ప్రజాదరణ పొందిన పాన్-ఇండియా కథానాయకుల్లో ఒకరు. మలయాళం, తెలుగు, తమిళం, హిందీ భాషలలో వరుస విజయాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్‌ను సంపాదించుకున్నారు. 1986 జూలై 28న కేరళలోని కొచ్చిలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి సల్ఫత్ దంపతులకు పుట్టాడు మ‌నోడు. చెన్నైలో పుపాఠశాల విద్యను పూర్తి చేసిన తర్వాత, అమెరికాలోని పర్డ్యూ విశ్వ విద్యాలయం నుండి బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో బ్యాచిలర్ డిగ్రీ పొందారు, 2011 డిసెంబర్ 22న చెన్నైకి చెందిన ఆర్కిటెక్ట్ అమల్ సూఫియా ను వివాహం చేసుకున్నాడు. వీరికి ‘మరియం అమీరా సల్మాన్’ అనే కుమార్తె ఉంది. నటుడిగానే కాకుండా నేపథ్య గాయకుడిగా, వ్యాపారవేత్తగా, ‘వేఫేరర్ ఫిల్మ్స్’ అనే నిర్మాణ సంస్థ అధినేతగా వ్యవహరిస్తున్నారు.

తెలుగులో దుల్కర్ సల్మాన్‌కు అద్భుతమైన విజయాలు ద‌క్కాయి. భారీ అభిమాన గణం ఉంది, త‌ను నటించిన తొలి తెలుగు చిత్రం మహానటి. 2022లో వ‌చ్చిన సీతారామం లో కీ రోల్ పోషించాడు. హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ క్లాసిక్ లవ్ స్టోరీలో ‘లెఫ్టినెంట్ రామ్’గా దుల్కర్ నటన అజరామరంగా నిలిచింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించింది. 2024లో వ‌చ్చిన క‌ల్కిలో అతిథి పాత్ర‌లో న‌టించాడు. ఇదే ఏడాదిలో వ‌చ్చిన లక్కీ భాస్క‌ర్ మూవీ బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. 1980ల నాటి బ్యాంకింగ్ మోసాల నేపథ్యంలో సాగుతుంది. సామాన్య మధ్యతరగతి బ్యాంక్ ఉద్యోగి భాస్కర్ పాత్రలో దుల్కర్ అద్భుతంగా నటించాడు. ఇది పాన్-ఇండియా స్థాయిలో రూ. 100 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఇక ఈ ఏడాది 2026లో పవన్ సాధినేని దర్శకత్వం వ‌హించిన ఆకాశంలో ఒక తార సినిమా ఆశించిన దానికంటే అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌చ్చింది. ఇది రూ. 200 కోట్ల మార్క్ ను దాటేలా ఉంది. ఎన్నో అవార్డులు, పుర‌స్కారాలు అందుకున్న దుల్క‌ర్ స‌ల్మాన్ ప్ర‌పంచంలోనే జ‌నాదర‌ణ పొందిన టైమ్ మ్యాగజైన్ జాబితాలో చోటు ద‌క్కించుకున్నాడు. భాషతో సంబంధం లేకుండా కథకు ప్రాధాన్యతనిస్తూ సహజమైన నటనతో దక్షిణాదితో పాటు ఉత్తరాది ప్రేక్షకులను కూడా మెప్పిస్తున్న అరుదైన నటుడు దుల్కర్ సల్మాన్ మ‌రిన్ని విజ‌యాలు సాధించాల‌ని కోరుకుందాం.

Leave A Reply

Your Email Id will not be published!