Gaddar Singer : జన గానం అజరామరం
ప్రజా యుద్ద నౌక పోటెత్తిన పాట
Gaddar Singer : తూటాలు శరీరంలో ఉన్నా పాటనే తన ఆయుధంగా మల్చుకున్న యోధుడు, ప్రజా గాయకుడు గద్దర్. 74 ఏళ్లు జీవించిన గద్దర్ అలియాస్ గుమ్మడి విఠల్ రావు గురించి ఎంత చెప్పినా తక్కువే. తుపాకి తూటా ద్వారానే రాజ్యం సిద్దిస్తుందని నమ్మిన గాయకుడు. ప్రజా సాంస్కృతిక క్షేత్రంలో ఉంటేనే మనం ఏది మాట్లాడినా పాటలు పాడినా జనానికి అర్థం అవుతుందని అర్థం చేసుకుని తన పంథాను మార్చుకున్నా ..తన పాటకు మరింత పదును పెడుతూ వచ్చాడు గద్దర్. గద్దర్(Gaddar Singer) ను ఒక గాయకుడిగా చూడలేం. కానీ గొప్ప సాంస్కృతిక యోధుడిగా తనను తాను మార్చుకున్నాడు. ఒకరా ఇద్దరా లక్షలాది మందిని తన ఆట, పాటలతో ప్రభావితం చేసిన ఇలాంటి కవి, గాయకుడు తెలంగాణలో పుట్టడు.
Gaddar Singer Journey
గద్దర్ మాటనే తూట. పాటనే ఒక బరిసె లాగా ఉపయోగించిన యుద్ద నౌక . అందుకే ఇవాళ తెలంగాణ యావత్ ప్రజా సమూహం దుఖః సాగరంలో మునిగి పోయింది. తన బిడ్డ ఏడంటూ తెలంగాణ రోదిస్తున్నది. ఆయన భౌతికంగా లేరన్న వార్తను జీర్ణించు కోలేకో పోతున్నారు జనం. కన్నీటి పర్యంతమై తల్లడిల్లి పోతున్నారు. గద్దర్ ఒక శక్తి. దట్టించిన తూటా కంటే గొప్పది ఆయన పాట. ఆయన గొంతుక అణగారిన వర్గాలకు భరోసా ఇచ్చింది. ప్రాణమై ప్రణమిల్లేలా చేసింది. తన జీవిత కాలంలో ఎన్నో ఉద్యమాలకు పాటతో , గొంతుకతో ఊపిరి పోశాడు. తానే పాటై వ్యాపించాడు. ప్రవహించాడు..ప్రజలను చైతన్యవంతం చేశాడు. ఎక్కడ తూఫ్రాన్ ఎక్కడ ఈ దేశం. పక్షిలాగా తిరిగా..నదిలా మారాడు..సముద్రమై అల్లుకు పోయాడు గద్దర్.
తనతో పాటు ఎందరో కళాకారులను తయారు చేశాడు. తన గానంతో చైతన్యవంతం చేయడమే కాదు వారిని కూడా మార్చిన పాటల యోధుడు గద్దర్. ఇవాళ తెలుగు ప్రజలు ఆత్మీయుడిని, పాటల బాట సారిని కోల్పోవడం బాధాకరం. ఇది తీరని నష్టం. ఇలాంటి గాయకుడు ఈ నేల మీద పుట్టడం ఇక్కడి వారి అదృష్టం. తూటాలను దాటుకుని పాటల్ని యుద్దంలో వాడే సైనికుల్లాగా తయారు చేసిన గద్దర్ లేడంటే నమ్మగలమా. భౌతికంగా గద్దర్ మాట్లాడక పోవచ్చు. పాట పాడక పోవచ్చు..కానీ నిన్నటి దాకా ఆయన నినదించిన, గర్జించిన పాటలు ఎల్లప్పటికీ బతికే ఉంటాయి..సూర్య చంద్రులు ఉన్నంత దాకా నిలిచే ఉంటాయి. యోధుడికి మరణం లేదు..పాటకు మరణం లేదు.
Also Read : AP CM YS Jagan : గద్దర్ మరణం ఊహించనది – జగన్