ఐబీఎం క్వాంటం కంప్యూటింగ్ సెంటర్‌కు గ్రీన్ సిగ్న‌ల్

ఆమోదం తెలిపిన‌ ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌భుత్వం

అమ‌రావ‌తి : ఏపీ ప్ర‌భుత్వం ఐబీఎం కంపెనీ క్వాంట‌మ్ కంప్యూటింగ్ సెంట‌ర్ ను ఏర్పాటు చేసేందుకు అనుమ‌తి ఇచ్చింది. ఇందుకు సంబంధించి అధికారిక ప్ర‌క‌ట‌న కూడా విడుద‌ల చేసింది. ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు ఏపీ ఐటీ కార్య‌ద‌ర్శి భాస్క‌ర్ కాట‌మ‌నేని. ఈ నెట్‌వర్క్‌లో విద్యాసంస్థలు, పరిశ్రమల క్లయింట్లు, స్టార్టప్‌లు , క్వాంటం కంప్యూటింగ్‌ను అభివృద్ధి చేసే ఇతర భాగస్వాములు ఉంటార‌ని తెలిపారు. ఈ నెట్‌వర్క్‌లో భాగంగా, క్వాంటం ఇన్నోవేషన్ సెంటర్లు పరిశోధన, సామర్థ్య పెంపుదల కేంద్రాలుగా పనిచేస్తాయి. బోయింగ్, వెల్స్ ఫార్గో, క్లీవ్‌ల్యాండ్ క్లినిక్ వంటివి ఐక్యూఎన్ లో భాగ‌స్వామ్యం క‌లిగి ఉన్నాయిన్నారు. సంబంధిత పక్షాల మధ్య కుదిరిన నిబంధనలు, షరతులకు అనుగుణంగా ఏక్యూసీసీ త‌న సంస్థాగ‌త ప‌రిధిలో ఐబీఎం క్యూఐసీ ని ఏర్పాటు చేస్తుంద‌న్నారు.

ఐబీఎం క్వాంటంకు సంబంధించిన విద్య, పరిశోధన, ఆవిష్కరణ, పర్యావరణ వ్యవస్థ కార్యక్రమాలలో పాల్గొనవచ్చు అని ఆదివారం జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వులో పేర్కొంది. క్వాంటం విద్య, పరిశోధన, ఆవిష్కరణ, పర్యావరణ వ్యవస్థ అభివృద్ధి, మానవ వనరుల నైపుణ్యాభివృద్ధి , ప్రపంచ స్థాయి భాగస్వామ్య కార్యక్రమాలలో సహకారాన్ని పెంపొందించేందుకు ఐబీఎం క్వాంటం ప్ర‌తిపాదించింద‌ని తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లో క్వాంటం కంప్యూటింగ్ పరిశోధన, ఆవిష్కరణ, నైపుణ్యాభివృద్ధి, పరిశ్రమల సహకారం, పర్యావరణ వ్యవస్థ అభివృద్ధిని ప్రోత్సహించడానికి ‘కంపెనీల చట్టం-2013 కింద ఈ దక్షిణ రాష్ట్రంలో ఏక్యూసీసీ ని ఏర్పాటు చేశారు.

ప్రభుత్వం నుండి ప్రత్యేకంగా నిర్దిష్ట అనుమతి పొందితే తప్ప, ఈ ఏర్పాటు వల్ల ప్రస్తుతం లేదా భవిష్యత్తులో ప్రభుత్వ ఖజానాపై ఎటువంటి ఆర్థిక భారం, బాధ్యత లేదా పునరావృత వ్యయం పడదని ఐటీ కార్య‌ద‌ర్శి పేర్కొన్నారు.

Leave A Reply

Your Email Id will not be published!