కేరళ : దర్శకురాలు, నటి గీతూ మోహన్ దాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారీ బడ్జెట్ తో తన దర్శకత్వంలో యశ్ కీలక పాత్రలో టాక్సిక్ తీశారు. ఆగస్టు 26న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.ఈ సందర్భంగా తన మనసులోని మాటలను బయట పెట్టింది ఈ ముద్దుగుమ్మ. ఇప్పటికే టాక్సిక్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. భారతీయ తెరపై ఒక భారీ బడ్జెట్ సినిమాను, అంతే సాహసంగా తెరకెక్కించిన తొలి డేరింగ్ దర్శకురాలిగా పేరు పొందారు గీతూ మోహన్‌దాస్. గత నాలుగేళ్లుగా అందరి దృష్టి ఆమె తీస్తున్న ‘టాక్సిక్’ పైనే. యశ్‌లాంటి పాన్ ఇండియా స్టార్‌తో హై ఓల్టేజ్ యాక్షన్ సినిమా తీయడం మామూలు విషయం కాదు. ఆ సినిమా గ్రాండ్ రిలీజ్ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. చిన్న సినిమాలు కాదు పెద్ద సినిమాతో వెండితెర మీద మెరవాలనుకున్నా. అందుకే 2013లో ‘లయర్స్ డైస్’ హిందీ సినిమా తీసి దర్శకురాలిగా పరిచమయ్యా. అది రెండు జాతీయ అవార్డులు గెలుచుకుంది. అంతేకాదు 87వ అకాడమీ అవార్డులలో ‘ఉత్తమ విదేశీ భాషా చిత్రం’ విభాగంలో మనదేశం తరపున అధికారిక ఎంట్రీని పొందింది. ఆ తర్వాత చిత్రం ‘మూతూన్’ హిందీ, తమిళంలో వచ్చింది. ఈ సినిమాకి గ్లోబల్ ఫిల్మ్‌మేకర్ అవార్డు అందుకున్నా. దర్శకురాలిగా మారిన తర్వాత ఇన్ని అవార్డులు దక్కుతాయని అనుకోలేదని చెప్పింది గీతూ మోహన్ దాస్. 2001లోనే ప్రముఖ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన ‘వీడెక్కడి మొగుడండీ’లో సెకండ్ హీరోయిన్‌గా వేణు తొట్టెంపూడి సరసన కనిపించా. అయితే ఆ సినిమా ఆడలేదు. ఆ తర్వాత తెలుగులో నాకు సరైన అవకాశాలు కూడా రాలేదు.
నా అసలు పేరు గాయత్రీ దాస్. పుట్టింది కేరళలోనైనా పెరిగింది మలేషియా, కెనడాలో. ఐదేళ్ల వయసులో మోహన్‌లాల్ ‘ఒన్ను ముతల్ పూజ్యం వారే’ సినిమాతో మలయాళ తెరపై బాలనటిగా కనిపించారు. అప్పుడే తన పేరు గీతూగా మారింది. ఆ సినిమాకు ఉత్తమ బాలనటిగా కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డు అందుకున్నారు. గమ్మత్తేమిటంటే తను మొదట హీరోయిన్‌గా చేసింది కూడా మోహన్‌లాల్ సరసనే. 2000 సంవత్సరంలో హీరోయిన్‌గా తమిళ, మలయాళ సినిమాల్లో నటించారు. 2009లో నటనకు బ్రేక్ ఇచ్చారు. ఆ తర్వాత నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టారు. ముందుగా ఒక లఘుచిత్రం తీశారు. దానిని ‘ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ రోటర్ డామ్’లో ప్రదర్శించారు. బెస్ట్ షార్ట్ ఫిక్షన్ విభాగంలో మూడు అంతర్జాతీయ అవార్డులు అందుకున్నారు. జాతీయ అవార్డు కూడా వచ్చింది. నా షార్ట్‌ఫిల్మ్‌ను కేరళలో 12వ తరగతి పాఠ్యపుస్తకంలో ఒక పాఠ్యాంశంగా చేర్చారు. అది నాకు లభించిన గొప్ప గౌరవం అని పేర్కొంది గీతూ మోహన్ దాస్. తాను నటించిన ‘శేషం’ అనే మలయాళ సినిమాకు రాజీవ్ రవి కెమెరామెన్‌గా పనిచేశాడు. అక్కడే ఇద్దరికీ పరిచయం. పన్నెండేళ్ల పాటు స్నేహం కొనసాగింది. తొలి షార్ట్‌ఫిల్మ్‌కి ఆయనే సినిమాటోగ్రాఫర్. 2009లో మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. వీరికి ఒక పాప. తన పేరు ఆరాధన. పెళ్లి తర్వాత ఐదేళ్ల పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చా. అప్పుడే తన భర్త రవి దగ్గర సినిమా దర్శకత్వానికి సంబంధించి అనేక మెలకువలు నేర్చుకున్నారు. ‘టాక్సిక్’ సినిమాకి సంబంధించి యశ్ క్యారెక్టర్‌ని రివీల్ చేస్తూ గ్లింప్స్ విడుదల చేశారు. ఆ సమయంలో తన మీద చాలా విమర్శలొచ్చాయి. ‘ఒక మహిళ అయి ఉండి ఇంటిమేట్ సీన్స్ అలా తీయడమేంటి అంటూ తీవ్రంగా విమర్శించారు. మహిళను కాబట్టే వారికి మింగుడు పడలేదని తెలుసు. అందుకే విమర్శలను వింటూ, చూస్తూ చిల్ అవుతున్నట్లు చెబుతోంది ఈ ముద్దుగుమ్మ. సమాజం ఇప్పటికీ మహిళల స్వేచ్ఛ, వారి సమ్మతి, ఆనందం వంటి అంశాలపై చర్చల దశల్లోనే ఉందని పేర్కొంది.
తెర మీద యశ్ అంటే ఏమిటో అందరికీ తెలుసు. నావరకైతే యశ్ కేవలం ఒక స్టార్ ప్రొడ్యూసర్, బ్రిలియంట్ యాక్టర్, కో-రైటర్ మాత్రమే కాదు. యశ్ అంటే ఒక డీప్ ఎమోషన్. ‘టాక్సిక్’ తర్వాత నా కెరీర్ ఎలా ఉంటుందో నాకు తెలియదు. కానీ నన్నెవరూ నమ్మనప్పుడు యశ్ నన్ను నమ్మాడు. ఇంత భారీ సినిమా నేను పూర్తి చేయలేనని చాలామంది యశ్‌తో అన్నారు. కానీ నన్ను నమ్మి నాలుగేళ్లకు పైగా నాతో ట్రావెల్ చేశాడు. నా టాలెంట్‌పై అంత నమ్మకం ఉంచినం దుకు యశ్‌కి సర్వదా రుణపడి ఉంటానని చెప్పంది గీతూ మోహన్ దాస్.
