గుజరాత్ : మిస్ యూనివర్స్ ఇండియా 2026గా 19 ఏళ్ల వయసు కలిగిన కజియా లిజ్ మెజో ఎంపికయ్యారు. న్యాయనిర్ణేతల బృందంలో సభ్యురాలిగా వ్యవహరించారు నటి ఊర్వశి రౌతేలా. ఈ సందర్ంగా ఆమె ఇలా అన్నారు . ఆ అనుభూతి అద్భుతంగా ఉందని నేను చెప్పాలనుకుంటున్నాను. పద్నాలుగు ఏళ్ల క్రితం, నాకు 17న్నర ఏళ్ల వయసు ఉన్నప్పుడు, నా గురువు , మార్గదర్శి సుస్మితా సేన్ నాకు కిరీటాన్ని అందించారు. అప్పుడు కలిగిన ఆనందం వర్ణనాతీతం. ఈ రోజు సుస్మితా సేన్ నన్ను, ‘ఊర్వశి, ఆ క్షణాలు నీకు గుర్తున్నాయా? ఆ ప్రయాణం గుర్తుందా?’ అని అడిగారు. దానికి నేను, ‘అవును, అవన్నీ నాకు స్పష్టంగా గుర్తున్నాయి’ అని చెప్పాను. ఆమెతో కలిసి కూర్చున్నప్పుడు ఆ జ్ఞాపకాలన్నీ ఫ్లాష్‌బ్యాక్‌లా కళ్ల ముందు కదిలాయి. అప్పుడు నా ముఖంలో ఉన్న ఆనంద భావన, ఆ అత్యున్నతమైన అనుభూతి ఇప్పటికీ నాకు గుర్తున్నాయని పేర్కొన్నారు రౌతేలా.
ఇక విన్నర్ గా నిలిచిన మిస్ యూనివర్స్ ఇండియా 2026 కజియా లిజ్ మెజో ఇలా అన్నారు: ఇద్దరు గొప్ప దిగ్గజాల సమక్షంలో భారతదేశ స్ఫూర్తి నాకు అండగా నిలవగా నా ప్రయాణాన్ని ప్రారంభించడానికి ఇంతకంటే మంచి మార్గం మరొకటి ఉండదని నేను భావిస్తున్నాను. ‘మిస్ యూనివర్స్’ (విశ్వ సుందరి) దిశగా నా ప్రయాణాన్ని సరిగ్గా ఇలాగే మొదలు పెట్టాలని నేను కోరుకున్నాను. ఇది మీ కోసం, భారతదేశమా! నేను ఆ కిరీటాన్ని గెలుచుకుని మన దేశానికి తీసుకు వస్తానని సంచలన ప్రకటన చేశారు. ఇదిలా ఉండగా ఈ మిస్ ఇండియా ఎంపిక కార్యక్రమం జైపూర్ పట్టణంలో జరిగింది. భారీ ఎత్తున జనం హాజరయ్యారు.
