శ‌ర‌వేగంగా పోల‌వ‌రం ప్రాజెక్టు ప‌నులు

తుది నివేదిక‌లు సిద్దం చేసి స‌ర్కార్ కు స‌మ‌ర్ప‌ణ

అమ‌రావ‌తి : పోలవరం ప్రాజెక్ట్ లో నిర్మిస్తున్న ఎర్త్ కం రాక్ డ్యామ్ (ఈ సి ఆర్ ఎఫ్ )లో కేంద్ర మట్టి, పదార్ధాల పరిశోధనా కేంద్రం ( సి ఎస్ ఎం ఆర్ ఎస్ ) నిపుణులు పరీక్షలు నిర్వహించారు. ఈ సి ఆర్ ఎఫ్ లో ఇప్పటి వరకు నిర్మించిన ప్రాంతంలో ఎంత వరకు నీరు ఇంకుతుంది, నేల గట్టిదనం ఎంత ఉంది అనే పరీక్షలను ఈ నిపుణులు ప‌రీక్షించారు. ఈ సి ఆర్ ఎఫ్ లో నీరు ఇంకా కుండా ఉండాలి, అదే సమయంలో నేల గట్టిదనం నిర్ధేశిత ప్రమాణాల మేరకు ఉండాలి. అనుకున్న నాణ్యతా ప్రమాణాల ప్రకారం ఈసిఆర్ఎఫ్ నిర్మాణం జరుగుతుందా లేదా అని ఈ బృందం పరీక్షలు నిర్వహిస్తోంది. సి ఎస్ ఎం ఆర్ ఎస్ బృందంలో సిద్దార్థ్ పీ హెడవూ, శ్రీహరి టి నాయర్ , అమిత్ సేన్ ఉన్నారు.

వీరికి అవసరమైన వివరాలను పోలవరం ప్రాజెక్ట్ ఎంఈఐఎల్ జనరల్ మేనేజర్ ఏ గంగాధర్, డీజీఎంలు మురళి పమ్మి, గుట్టపాటి శంకరయ్య, జలవనరుల శాఖ ఈఈ డి శ్రీనివాస్, డీఈఈలు నిర్మల, శ్రీనివాస్, శేఖర్ బాబు అందచేశారు. పరీక్షలు జరుగుతున్న తీరును పరిశీలించారు. సి ఎస్ ఎం ఆర్ ఎస్ నిపుణులు పారగమ్యత పరీక్ష (పర్మిటబిలిటీ ) నిర్వహించారు. ఇందులో ఈ సి ఆర్ ఎఫ్ వద్ద నీరు ప్రవహించే వేగాన్ని కొలిచారు. అదే సమయంలో నేల గట్టి దనాన్ని తెలుసుకునే పరీక్షలు క్షేత్ర స్థాయిలో చేశారు. అక్కడ నమూనాలు సేకరించి పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ ప్రాంతంలో ఉన్న ల్యాబ్ లో కూడా వీరు పరీక్షలు చేశారు. మరి కొన్ని నమూనాలను తమ వెంట ఢిల్లీ తీసుకు వెళుతున్న శాస్త్రవేత్తలు అక్కడ తమ కేంద్ర పరిశోధనాలయంలో మరింత లోతుగా పరీక్షించి తుది నివేదికలను సిద్ధం చేయనున్నారు.

Leave A Reply

Your Email Id will not be published!