అమరావతి : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో తాగునీటి ఎద్దడి లేకుండా చూస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన చొరవతో పులివెందుల నియోజకవర్గంతో పాటు పరిసర ప్రాంతాల తాగునీటి అవసరాలు తీరుతున్నాయి. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన భారీ ‘వాటర్ గ్రిడ్’ పథకంపై ప్రత్యేక దృష్టి సారించారు. ‘జల్ జీవన్ మిషన్’ ‘అమరావాణి వాటర్‌షెడ్’ పథకాల కింద సుమారు ₹280 కోట్ల నిధుల కేటాయించారు. ప్రాజెక్ట్ పనులు 96% పూర్తయ్యాయి.. పైప్‌లైన్ నిర్మాణం 99% వరకు జరిగింది. నీటి శుద్ది ప్లాంట్ పనులు మాత్రమే మిగిలి ఉన్నాయి. పులివెందుల పట్టణం, గ్రామీణ ప్రాంతాలు, సింహాద్రిపురం మండలంలో పనులు వంద శాతం పూర్తయ్యాయి. లింగాల మండల పరిధిలోని 24 ఆవాసాలకు తాగునీటి సరఫరా చేపట్టారు.
‘జల్ జీవన్ మిషన్-అమరావాణి వాటర్‌షెడ్’ పథకం కింద రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి రాష్ట్ర వ్యాప్తంగా తాగునీటి ప్రాజెక్టులను పారదర్శకంగా రాజకీయాలకు అతీతంగా ముందుకు తీసుకు వెళుతున్నారు. గత ప్రభుత్వం ప్రారంభించి, ఆ తర్వాత నిర్లక్ష్యం చేసిన పథకాలకు కూడా ఆయన ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ వాటిని పూర్తి చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం , పరిసర ప్రాంతాల ప్రజలు ఏళ్లుగా ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా, భారీ ‘వాటర్ గ్రిడ్’ పథకం నిర్మాణ పనులను వేగవంతం చేయడంపై ప్రత్యేక శ్రద్ధ వహించారు. గత ప్రభుత్వ హయాంలో నిలిచి పోయిన పనులను పునరుద్ధరించి, త్వరితగతిన పూర్తి చేసేలా ఆయన నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. సుమారు ₹426 కోట్ల విలువైన పనులలో 96% పూర్తి చేయడం ద్వారా ఆయన తన చిత్తశుద్ధిని చాటుకున్నారు.
జల్ జీవన్ స్కీం కింద ఇప్పటికే పులివెందుల, సింహాద్రిపురం మండలాలకు తాగునీరు సరఫరా చేస్తున్నారు. పులివెందుల పట్టణానికి సంబంధించిన పనులు కూడా పూర్తయ్యాయి. లింగాల మండల పరిధిలోని 27 ఆవాసాలలో, త్వరలోనే 24 ఆవాసాలకు తాగునీరు అందనుంది. వాటర్ గ్రిడ్ ప్రాజెక్టులో కీలకమైన ‘ఇన్‌టేక్ వెల్’ (నీటి సేకరణ బావి) పునరుద్ధరణ పనులు పూర్తయ్యాయి. 65 మిలియన్ లీటర్ల సామర్థ్యం గల నీటి శుద్ధి ప్లాంట్లు కూడా ఇప్పుడు పనిచేస్తున్నాయి. మొత్తం 1,111 కిలోమీటర్ల పైప్‌లైన్‌లో, 1,106 కిలోమీటర్ల నిర్మాణం పూర్తయింది. ఓవర్‌హెడ్ ట్యాంకులు , గ్రౌండ్ లెవల్ రిజర్వాయర్ల నిర్మాణం కూడా దాదాపు తుది దశకు చేరుకుంది.
