హైదరాబాద్ : సీఎం ఎ. రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కావాలని తన విదేశీ పర్యటనను కేంద్రం అడ్డుకుందని ఆరోపించారు. బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. ఇంగ్లాండ్ పర్యటనకు అనుమతించి అమెరికా పర్యటనకు కేంద్రం అడ్డు చెప్పిందన్నారు. తాము తమ పర్యటనకు సంబంధించి అన్ని వివరాలు కేంద్రానికి తెలియ చేశామన్నారు. అయినా అడ్డుకోవడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. బోస్టన్ హార్వర్డ్ యూనివర్సిటీల క్యాంపస్ లు తెలంగాణకు తేవాలనే లక్ష్యంతో పర్యటన చేపట్టామన్నారు. విద్యా, క్రీడల్లో పెట్టుబడుల సాధన కోసమే ఇంగ్లండ్, అమెరికా పర్యటన వెళ్లాలని అనుకున్నామని తెలిపారు. సీఎం లండన్ పర్యటన ముగించుకుని హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు.
బీజేపీ విచక్షణ కోల్పోయిందని మండిపడ్డారు. క్రీడా మైదానాలు.. యూనివర్సిటీలు ఇక్కడికి తేవాలనే ఒక సంకల్పంతో వెళ్తే ఎందుకు దుష్ప్రచారం చేస్తున్నారంటూ ప్రశ్నించారు సీఎం. తెలంగాణ రైజింగ్ ప్రణాళికలో భాగంగానే పర్యటించానని చెప్పారు. ఇది తనకు జరిగిన అవమానం కాదని, నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజలకు జరిగిన అవమానమని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇంకా గుజరాత్ సీఎం మాదిరిగా వ్యవహరిస్తున్నాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ లో తెలంగాణ అభివృద్ధిని ,పెట్టుబడులను అడ్డుకుంటున్న వైనంపై కేంద్రాన్ని ప్రశ్నిస్తాం అన్నారు. కేంద్రం వైఖరిని మంత్రులు , ఎమ్మెల్యేలు అందరం ఖండిస్తున్నామన్నారు. నా పర్యటన అడ్డుకున్నారని, కానీ నా లక్ష్యాన్ని అడ్డుకోలేరని ప్రకటించారు రేవంత్ రెడ్డి.
కావాలని తన విదేశీ పర్యటనను కేంద్రం అడ్డుకుందని ఆరోపించారు. బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. ఇంగ్లాండ్ పర్యటనకు అనుమతించి అమెరికా పర్యటనకు కేంద్రం అడ్డు చెప్పిందన్నారు. తాము తమ పర్యటనకు సంబంధించి అన్ని వివరాలు కేంద్రానికి తెలియ చేశామన్నారు. అయినా అడ్డుకోవడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. బోస్టన్ హార్వర్డ్ యూనివర్సిటీల క్యాంపస్ లు తెలంగాణకు తేవాలనే లక్ష్యంతో పర్యటన చేపట్టామన్నారు.
