Jagore Jago Song : జాగోరే జాగో కదిలిందిర జనసేన
పార్టీ విడుదల పాటకు ఆదరణ
Jagore Jago Song : ఏపీలో ఎన్నికల యుద్ధానికి సిద్దమయ్యారు జన సేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్. ఇప్పటికే వారాహి విజయ యాత్రకు శ్రీకారం చుట్టారు. మొదటి విడత పూర్తయింది. రెండో విడత ఇవాల్టి నుంచి ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా ఆదివారం పార్టీకి సంబంధించి జనాన్ని చైతన్య పరిచేందుకు గాను జనసేన ప్రత్యేకంగా పాటను రూపొందించింది. విడుదల చేసింది. ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
జాగోరే జాగో(Jagore Jago Song) కదిలిందర జనసేన అంటూ పాట దుమ్ము లేపుతోంది. ఈ పాటకు సంగీతం అందించారు భీమ్స్ సిసిరోలియో. పాటను నల్లగొండ గద్దర్ తో పాటు మధుప్రియ ఆలాపించారు. జాగోరే జాగో సాంగ్ ను బుర్రా సతీష్ రాశారు. చిక్కాల వెంకట కృష్ణ వీడియో ఎడిటింగ్ అద్భుతంగా చేశారు. హరీష్ పై దీనిని ప్లాన్ చేశారు. కర్త , కర్మ ఆయనే కావడం విశేషం.
ఈ జాగోరో జాగో పాట ఇప్పుడు జనసేన పార్టీకి మంచి ఊపు తీసుకు వచ్చేలా చేస్తుందనడంలో సందేహం లేదు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. పాటను తెగ ఎంజాయ్ చేస్తున్నారు. విడుదల చేసిన కొద్ది నిమిషాల్లోనే పెద్ద ఎత్తున దీనిని వీక్షిస్తుండడం విశేషం. వ్యూస్ కూడా భారీ స్థాయిలో పెరిగాయి.
Also Read : Tamilnadu No 1 : పవన విద్యుత్ లో తమిళనాడు టాప్
