Tamilnadu No 1 : పవన విద్యుత్ లో తమిళనాడు టాప్
ప్రపంచంలోనే నెంబర్ వన్ ర్యాంక్
Tamilnadu No 1 : తమిళనాడు రాష్ట్ర సర్కార్ అరుదైన ఘనత సాధించింది. పవన విద్యుత్ ఉత్పత్తిలో ప్రపంచంలోనే నెంబర్ వన్ గా నిలిచింది. ఈ విషయాన్ని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్) ప్రకారం పవన విద్యుత్ ను తయారు చేయడంలో ముందంజలో కొనసాగుతోందని వెల్లడించింది. గ్రీన్ ఎలక్ట్రికల్ ఛాంపియన్లుగా పరిగణించే స్వీడన్ , డెన్మార్క్ కంటే తమిళనాడు టాప్ లో నిలవడం విశేషం. ఇది ఏకంగా 7.0 జీడబ్ల్యు పవన విద్యుత్ శక్తిని కలిగి ఉంది. ఇది స్వీడన్ కు సంబంధించి 6.7 జీడబ్ల్యూని మించి పోయింది.
మరో వైపు కేంద్ర ప్రభుత్వం పవన్ విద్యుత్ పై ఎక్కువగా ఫోకస్ పెట్టింది. పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ గత జూన్ 15 నుంచి గ్లోబల్ విండే డే ఉత్సవాలలో భాగం పంచుకుంటోంది. విండ్ ఎనర్జీ ప్రోగ్రెస్ , ఆఫ్ షోర్ విండ్ డెవలప్ మెంట్ , పవన శక్తి తయారీ పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడం, పవన శక్తి కోసం గ్రీన్ ఫైనాన్స్ లో లోతైన చర్చలు చేపట్టారు.
ఇందులో భాగంగా కేంద్ర సర్కార్ 2023 సంవత్సరం నాటికి 500 జీడబ్ల్యూ పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని సాధించాలనే లక్ష్యాన్ని పెట్టుకుంది. గాలితో అన్ని రాష్ట్రాల సహకారం అందుకునేలా ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో తమిళనాడు(Tamilnadu), గుజరాత్ , రాజస్థాన్ రాష్ట్రాలు పవన విద్యుత్ లో వరుసగా టాప్ లో నిలవడం విశేషం.
Also Read : Akhanda Parayanam : తిరుమలలో అఖండ పారాయణం
