Gorantla Buchi Babu Arrest : కవితకు షాక్..బుచ్చిబాబు అరెస్ట్
బీఆర్ఎస్ ఎమ్మెల్సీకి కోలుకోలేని షాక్
Gorantla Buchi Babu Arrest : ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు రోజు రోజుకు ట్విస్ట్ చోటు చేసుకుంటోంది. భారత రాష్ట్ర సమితి పార్టీ చీఫ్ , తెలంగాణ సీఎం కేసీఆర్ ముద్దుల కూతురు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్ ఇచ్చింది కేంద్ర దర్యాప్తు సంస్థ. ఇప్పటికే సీబీఐ కోర్టుకు సమర్పించిన రెండో ఛార్జ్ షీట్ లో ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తో పాటు ఎమ్మెల్సీ కవిత పేరు కూడా చేర్చింది.
తాజాగా కవితకు చెందిన మాజీ ఆడిటర్ బుచ్చిబాబును అరెస్ట్(Gorantla Buchi Babu Arrest) చేసింది కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ , సీబీఐ ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో సౌత్ గ్రూప్ కీలకంగా వ్యవహరించిందని రూ. 100 కోట్లకు పైగా చేతులు మార్చిందంటూ సంచలన ఆరోపణలు చేసింది. అంతే కాదు ఎమ్మెల్సీ కవిత ఆధారాలు చిక్కకుండా ఏకంగా 10 ఫోన్లను ధ్వంసం చేసిందంటూ బాంబు పేల్చింది.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసుకు సంబంధించి హైదరాబాద్ లో సోదాలు చేపట్టింది. గతంలో కేసీఆర్ కూతురు కవిత వద్ద ఉద్యోగం చేశాడు చార్టెర్డ్ అకౌంటెంట్ బుచ్చిబాబు. ఆయనను దేశ రాజధాని ఢిల్లీకి పిలిపించింది సీబీఐ. ఆ వెంటనే అదుపులోకి తీసుకుంది. ఇదిలా ఉండగా సౌత్ గ్రూప్ తరపున బుచ్చిబాబు కీలక పాత్ర పోషించారంటూ ఆరోపించింది దర్యాప్తు సంస్థ.
అతడి వ్యవహారం అనుమానాస్పదంగా ఉండడంతో మంగళవారం సాయంత్రం అరెస్ట్ చేసినట్లు ప్రకటించింది. అంతకు ముందు ఈ కేసుకు సంబంధించి కల్వకుంట్ల కవితను సీబీఐ టీం డిసెంబర్ 12న హైదరాబాద్ లో 7 గంటలకు పైగా విచారించింది.
Also Read : ప్రగతి భవన్ ను కూల్చేయాలి – రేవంత్