చెన్నై : చావో రేవో తేల్చు కోవాల్సిన సమయంలో సూర్య కుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత జట్టు భారీ స్కోరు సాధించింది. ఐసీసీ టి20 వరల్డ్ కప్ లో భాగంగా సూపర్ 8 కింద జింబాబ్వేతో జరిగిన పోరులో ఆకాశమే హద్దుగా చెలరేగారు బ్యాటర్లు. తొలుత మైదానంలోకి దిగిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 256 పరుగుల భారీ స్కోరును సాధించింది. స్కోర్ పరంగా గతంలో పొట్టి ప్రపంచ కప్ లో అత్యధిక స్కోర్ సాధించింది. గతంలో 220 పరుగులు చేసింది ఇండియా. కానీ అదే రికార్డును బ్రేక్ చేసింది . గ్యాప్ తర్వాత సంజూ శాంసన్ ను తీసుకుంది మేనేజ్మెంట్. బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. శాంసన్ 15 బంతులు ఎదుర్కొని 24 రన్స్ చేశాడు.
ఇషాన్ కిషన్ , అభిషేక్ శర్మ దుమ్ము రేపాడు. జింబాబ్వే బౌలర్లను చితకబాదారు. మ్యాచ్ పరంగా చూస్తే టోర్నీలో నిరాశ పర్చిన అభిషేక్ శర్మ ఈ మ్యాచ్ లో సహజ సిద్దమైన ఆటతో ఆకట్టుకున్నాడు. 55 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ 33 పరుగులు చేస్తే తిలక్ వర్మ 44 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. హార్దిక్ పాండ్యా సూపర్ షో చేశాడు. హాఫ్ సెంచరీతో నాటౌట్ గా నిలిచాడు. దీంతో పొట్టి ప్రపంచ కప్ లో భారీ స్కోరును సాధించింది. అభిషేక్ శర్మకు తోడుగా మైదానంలోకి దిగిన శాంసన్ తనదైన స్టైల్ లో ఆడాడు. ఎదుర్కొన్న రెండో బంతినే సిక్సర్ బాదాడు. అనంతరం మపోస ఓవర్ లో ఫోర్లు కొట్టాడు. ఆ తర్వాత సిక్స్ కొట్టబోయి అవుట్ అయ్యాడు. ఇషాన్ కిషన్ 38 పరుగులు చేశాడు.
.
