చెన్నై : కేరళ స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తను తాజాగా భారత జట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాడు. తన పర్ ఫార్మెన్స్ గురించి పదే పదే విమర్శలు కొనసాగుతుండడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జింబాబ్వేతో జరిగిన కీలక పోరులో తను కేవలం 15 బంతులు మాత్రమే ఎదుర్కొని 24 రన్స్ చేశాడు. ఏ ఆటగాడైనా అద్బుతంగా ఆడాలని అనుకుంటాడని అన్నాడు. కుదురు కునేందుకు కొంత సమయం పడుతుందన్నాడు సంజూ శాంసన్ . జింబాబ్వేపై గెలుపొందిన అనంతరం తను మీడియాతో మాట్లాడాడు. తన మనసులోని అభిప్రాయాలను పంచుకున్నాడు.
మ్యాచ్ లో భాగంగా నా వంతు ఆడేందుకు ప్రయత్నం చేశానని అన్నాడు సంజు శాంసన్. అది కూడా ఓపెనర్‌గా, అయినప్పటికీ నేను ఈరోజు విఫలమయ్యానంటూ రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్‌లో త్వరగా 20 పరుగులు చేసినప్పుడు, అతనికి స్టాండింగ్ ఒవేషన్ లభిస్తుందన్నాడు. అతనికి బలమైన PR మద్దతు ఉందని నాకు తెలుసంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. కానీ తాను ఇప్పటికీ నా వంతు ఆడేందుకు, బలమైన షాట్స్ కొట్టేందుకు ప్రయత్నం చేస్తున్నానని చెప్పాడు కేరళ స్టార్ క్రికెటర్. ఈ T20 ప్రపంచ కప్‌లో నేను టీమ్ ఇండియాకు ఇచ్చిన ప్రారంభం, రోహిత్‌కు ఇలాంటి ప్రారంభాన్ని ఇవ్వడానికి ఆరు T20 ప్రపంచ కప్‌లు పట్టిందన్నాడు సంజు శాంసన్. కాబట్టి ఈ విషయాలన్నింటిపై దృష్టి పెట్టడం మానేసి మాకు మద్దతు ఇవ్వడం కొనసాగించాలని అభిమానులను, క్రికెట్ ప్రేమికులను కోరాడు.
