47 లక్ష‌ల మంది రైతుల‌కు రూ. 310 కోట్లు

పెట్టుబ‌డి రాయితీ ఇచ్చామ‌న్న చంద్ర‌బాబు

అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. రాష్ట్రంలో 47 లక్షల మంది రైతులకు రూ.310 కోట్లు పంట నష్టపోయిన రైతులకు పెట్టబడి రాయితీ ఇచ్చామ‌న్నారు. రూ.10,816 కోట్ల మేర 24 గంటల్లో ధాన్య కొనుగోళ్ల కోసం రైతులకు చెల్లించడం జ‌రిగింద‌ని చెప్పారు. గత పాలకులు రైతులకు చెల్లించాల్సిన రూ.1670 కోట్ల ధాన్యం బకాయిలు కూడా మేమే చెల్లించాం అన్నారు సీఎం. రైతు ఆత్మహత్యలు కూడా ఆ ప్రభుత్వ హయాంలో జరిగాయన్నారు. ఇప్పుడు వాటిని నియంత్రించేలా ప్రతీ ఘటననూ ఆడిట్ చేయించేలా నిర్ణయం తీసుకున్నామ‌ని చెప్పారు. వ్యవసాయ యాంత్రీకరణ పెద్ద ఎత్తున తీసుకు రావటంతో పాటు ఏఐ ఆగ్రానమిస్టు సేవలు కూడా అందేలా చేస్తాం అన్నారు. 14,230 కోట్ల మేర ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయ‌ని చెప్పారు.

వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్‌ పై పెద్ద ఎత్తున దృష్టి పెట్టామ‌న్నారు నారా చంద్ర‌బాబు నాయుడు. 8,168 గ్రామాల్లో 15 లక్షల మంది రైతులు ప్రకృతి సేద్యం చేస్తున్నారని తెలిపారు సీఎం. త్వరలో 50 లక్షల ఎకరాల్లో ప్రకృతి సేద్యం చేసేలా ప్రోత్సాహం ఇస్తున్నామ‌ని ప్ర‌క‌టించారు. ప్రస్తుతం రాయలసీమలో ఉద్యాన పంటలు 400 మిలియన్ టన్నుల మేర సాగు అవుతున్నాయని అన్నారు. వెయ్యి మిలియన్ మెట్రిక్ టన్నుల మేర ఉత్పత్తి అయ్యేలా లక్ష్యంగా పనిచేస్తున్నాం అని చెప్పారు నారా చంద్రబాబు నాయుడు. క్లస్టర్ విధానం ద్వారా ప్రభుత్వం రూ.30 వేల కోట్లతో ఈ ప్రణాళికను సిద్ధం చేస్తున్నామ‌ని తెలిపారు.

Leave A Reply

Your Email Id will not be published!