టీమిండియాపై ర‌విశాస్త్రి షాకింగ్ కామెంట్స్

ముంబై : ఐసీసీ టి20 టోర్న‌మెంట్ లో ఊహంచ‌ని రీతిలో బిగ్ షాక్ త‌గిలింది ద‌క్షిణాఫ్రికా చేతిలో. ఏకంగా 76 ప‌రుగుల తేడాతో ఓట‌మి పాలైంది. టీమిండియా అస‌లైన కీల‌క మ్యాచ్ ఈనెల 26న గురువారం జ‌ర‌గ‌నుంది. విచిత్రం ఏమిటంటే ఈ మ్యాచ్ అత్యంత కీల‌కం. దీంతో పాటు మ‌రో మ్యాచ్ వెస్టిండీస్ తో జ‌ర‌గాల్సి ఉంది. ఈ సంద‌ర్బంగా మాజీ భార‌త జ‌ట్టు కెప్టెన్, ప్ర‌ముఖ కామెంటేట‌ర్ ర‌విశాస్త్రి స్పందించాడు. స‌ఫారీల‌తో ఊహించ‌ని షాక్ త‌గిలింది. సూపర్ 8లలో దక్షిణాఫ్రికాపై జరిగిన ఓటమిని భారత మాజీ కోచ్ రవిశాస్త్రి మారువేషంలో ఉన్న వరంలా భావిస్తున్నాడు. ఇదే స‌మ‌యంలో భార‌త జ‌ట్టులో కీల‌క‌మైన మార్పులు చేయాల్సి ఉంది.

కాగా టి20 ప్ర‌పంచ క‌ప్ కు సంబంధించి గ‌త రెండు ఎడిష‌న్ల‌లో వ‌రుస‌గా 12 విజ‌యాల త‌ర‌వ్ఆత భార‌త్ ఎదుర్కొన్న మొద‌టి ఓట‌మి. ఈ మ్యాచ్ అత్యంత కీల‌కం. దీనిపై ఫుల్ ఫోక‌స్ పెట్టాల్సి ఉంటుంది. గత మ్యాచ్‌లో వాషింగ్టన్ సుందర్ స్థానంలో వైస్-కెప్టెన్ అక్షర్ పటేల్‌ను తీసుకు రావాలని ఆయన అనుకూలంగా ఉన్నారు. అక్షర్ పటేల్ ఆడుతుంటే, అతను 8వ స్థానంలో బ్యాటింగ్ చేస్తుంటాడు. 5వ స్థానంలో హార్దిక్ పాండ్యా, 6వ స్థానంలో శివం దుబే, 7వ స్థానంలో వాషింగ్టన్ సుందర్ ఉన్నారు. 5వ స్థానంలో అక్షర్ కూడా వెళ్లవచ్చు అని పేర్కొన్నాడు.

Leave A Reply

Your Email Id will not be published!