Jitendra Singh : స్టార్టప్ ఎకో సిస్టమ్ లో 3వ ప్లేస్ లో భారత్
వెల్లడించిన కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్
Jitendra Singh : కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. స్టార్టప్ ఎకోసిస్టమ్ లో భారత దేశం ప్రపంచ వ్యాప్తంగా 3వ స్థానంలో ఉందన్నారు. గత కొన్ని సంవత్సరాలలో పరిశోధన, అభివృద్ధిపై స్థూల వ్యయాన్ని మూడు రెట్లు పెంచడం జరిగిందని చెప్పారు.
దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లవుతోంది. ఇండియాలో ఇప్పుడు 75,000 వేల స్టార్టప్ లకు నిలయంగా మారిందని అన్నారు కేంద్ర మంత్రి. దేశ వ్యాప్తంగా సైన్స్ , టెక్నాలజీ, ఇన్నోవేషన్ లలో పరివర్తనాత్మక మార్పులను హైలెట్ చేస్తూ వచ్చిందని తెలిపారు.
స్టార్ట్ ఎకో సిస్టమ్ లో , యూనికార్న్ ల సంఖ్యా పరంగా కూడా దేశం మూడో స్థానంలో నిలవడం గర్వకారణంగా ఉందన్నారు. ప్రస్తుతం 105 యూనికార్న్ లు ఉన్నాయి. వీటిలో 2021 లో 44 ఉండగా 2022లో 19 ఏర్పాటైనట్లు వెల్లడించారు.
2021-30వ దశాబ్దం భారతీయ సైన్స్ , టెక్నాలజీ , ఇన్నోవేషన్ (ఎస్టీఐ) లో పరివర్తనాత్మక మార్పులను తీసుకు వస్తుందని ఆశిస్తున్నట్లు జితేంద్ర సింగ్ చెప్పారు. గత కొన్ని ఏళ్లుగా పరిశోధన, డెవలప్ మెంట్ పై ఎక్కువగా ఫోకస్ పెట్టామన్నారు.
తాజా డేటా ప్రకారం భారత దేశంలో 5 లక్షల మందికి పైగా ఆర్ అండ్ డి సిబ్బంది ఉన్నారని తెలిపారు. ఈ సంఖ్య గత ఎనిమిది ఏళ్లల్లో 40 నుంచి 50 శాతం వృద్ధిని చూపించిందన్నారు కేంద్ర మంత్రి.
ఊహించని రీతిలో మహిళల భాగస్వామ్యం కూడా పెరిగిందని వెల్లడించారు జితేంద్ర సింగ్(Jitendra Singh). దేశంలో స్టార్టప్ లు మెట్రోలు, పెద్ద నగరాలకు మాత్రమే పరిమితం కాలేదన్నారు. 49 శాతం స్టార్టప్ లు టైర్ -2, టైర్ -3 నగరాలకు కూడా విస్తరించాయని చెప్పారు.
ప్రధానంగా ఐటీ, వ్యవసాయం, విమానయానం, విద్య, ఇంధనం, ఆరోగ్యం, అంతరిక్ష రంగాల్లో స్టార్టప్ లు పుట్టుకొస్తున్నాయని స్పష్టం చేశారు.
Also Read : ఒడిశాలో అదానీ రూ. 57,000 కోట్ల పెట్టుబడి