KTR Slams : అవినీతికి కేరాఫ్ అడ్ర‌స్ కాంగ్రెస్

రాహుల్ గాంధీపై కేటీఆర్ ఫైర్

KTR Slams : దేశంలో ఏ ఒక్క పార్టీ బీఆర్ఎస్ ను, సీఎం కేసీఆర్ ను న‌మ్మ‌డం లేదంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన రాహుల్ గాంధీకి స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చారు మంత్రి కేటీఆర్. త‌మ పార్టీ బీజేపీ బంధువుల పార్టీ కాద‌న్నారు. ట్విట్ట‌ర్ వేదిక‌గా ఆయ‌న తీవ్రంగా స్పందించారు. ఏఐసీసీ అంటేనే అఖిల భార‌త క‌ర‌ప్ష‌న్ క‌మిటీ అంటూ ఎద్దేవా చేశారు కేటీఆర్(KTR). దేశంలో అంతులేని అవినీతి చోటు చేసుకోవ‌డానికి ప్ర‌ధాన కార‌ణం కాంగ్రెస్ పార్టీ అంటూ ఆరోపించారు. రాహుల్ కు స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చారు. స్కాంలు, క‌మీష‌న్ల క‌క్కుర్తి పొందింది ఎవ‌రో దేశ ప్ర‌జ‌ల‌కు తెలుస‌న్నారు కేటీఆర్.

త‌మ పార్టీ బీజేపీకి బీ టీమ్ కాదు..కాంగ్రెస్ పార్టీకి సీ టీమ్ కానే కాద‌ని పేర్కొన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల‌ను ఢీకొనే స‌త్తా క‌లిగిన ఏకైక ద‌మ్మున్న పార్టీ బీఆర్ఎస్ అని స్ప‌ష్టం చేశారు ఐటీ మంత్రి. రాబోయే ఎన్నికల్లో త‌మ పార్టీ చేతిలో కాంగ్రెస్ చావు దెబ్బ తిన‌డం ఖాయ‌మ‌న్నారు.

కాళేశ్వ‌రం ప్రాజెక్టు క‌ట్టేందుకు ల‌క్ష కోట్లు కూడా కాలేదు. మ‌రి ల‌క్ష కోట్ల అవినీతి ఎక్క‌డ జ‌రిగిందో తెలంగాణ ప్ర‌జ‌ల‌కు చెప్పాల‌ని డిమాండ్ చేశారు కేటీఆర్. నిర్మాణాత్మ‌క‌మైన ప్ర‌తిప‌క్షాన్ని జ‌నం కోరుకుంటున్నార‌ని నిరాధార ఆరోప‌ణ‌లు చేసే పార్టీని కాద‌న్నారు. ఇక‌నైనా ఆధారాలు లేకుండా మాట్లాడ వ‌ద్దంటూ స్ప‌ష్టం చేశారు .

Also Read : AP Rains : ఏపీలో వ‌ర్షాలు కురిసే ఛాన్స్

Leave A Reply

Your Email Id will not be published!