AP Rains : ఇరు తెలుగు రాష్ట్రాలలో వర్షాల కోసం జనం వేచి చూస్తున్నారు. ఇప్పటికే రుతు పవనాలు అదిగో ఇదిగో అంటూ ఊరిస్తూ వస్తున్నా ఒక్క నీటి చుక్క జాడ కనిపించడం లేదు. గత ఏడాది ఇప్పటికే వాగులు, వంకలు, చెరువులు, కుంటలు, నదులు, ప్రాజెక్టులు నిండి పోయి కళ కళ లాడాయి. కానీ ఈ ఏడాది మాత్రం వరుణుడు కరుణించడం లేదు. దీంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో మునిగి పోయింది రాష్ట్ర సర్కార్.
తాజాగా తీపి కబురు చెప్పింది ఏపీ రాష్ట్ర విపత్తుల నివారణ సంస్థ. రాష్ట్రంలో రానున్న మూడు రోజుల పాటు ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అంబేద్కర్ వెల్లడించారు. వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం కూడా ఉందని హెచ్చరించారు. ఉరుములతో కూడిన వర్షాలు(AP Rains) వస్తాయని అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షాలు కురిసే సమయంలో వ్యవసాయ పనుల్లో పని చేస్తున్న రైతులు, కూలీలు, పశువులు కాసే గొర్రెల కాపరులు ఉండొద్దంటూ హెచ్చరించారు.
ఇదిలా ఉండగా రాష్ట్రంలోని పార్వతీ పురం మన్యం జిల్లాతో పాటు అల్లూరి సీతా రామ రాజు, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, వైఎస్సార్ కడప జిల్లాలో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని తెలిపారు.
Also Read : Tirumala Rush : తిరుమల క్షేత్రం పోటెత్తిన భక్తజనం
