Tirumala Rush : తిరుమ‌ల క్షేత్రం పోటెత్తిన భ‌క్త‌జ‌నం

హుండీ ఆదాయం రూ. 4.20 కోట్లు

Tirumala Rush : సెల‌వులు ముగిసినా తిరుమ‌ల‌కు ర‌ద్దీ అలాగే ఉంది. పెద్ద ఎత్తున భ‌క్తులు శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామిని ద‌ర్శించుకునేందుకు తండోప తండాలుగా త‌ర‌లి వ‌స్తున్నారు. తిరుమ‌ల గిరులు గోవింద నామాల‌తో హోరెత్తుతోంది. గోవిందా గోవిందా..ఆప‌ద మొక్కుల వాడా గోవిందా..అనాధ ర‌క్ష‌క గోవిందా..అదివో అల్ల‌దివో శ్రీ‌హ‌రి వాస‌ము..ప‌ది వేల శేషుల ప‌డ‌గ‌ల మ‌యం..అంటూ పాడుకుంటున్నారు.

సెల‌వు దినం ఆదివారం కావ‌డంతో భ‌క్తులు స్వామి ద‌ర్శ‌నం కోసం పోటెత్తారు. 87 వేల 967 మంది స్వామి వారిని ద‌ర్శించుకున్నారు. మొక్కులు తీర్చుకునేందుకు పోటీ ప‌డ్డారు. తిరుమ‌ల కొండ భ‌క్తుల‌తో నిండి పోయింది. ఏపీ, తెలంగాణ‌తో పాటు దేశం న‌లు మూల‌ల నుండి త‌ర‌లి వ‌చ్చారు. 32 వేల 83 మంది భ‌క్తులు స్వామి కోసం త‌ల‌నీలాలు స‌మ‌ర్పించుకున్నారు.

ప్ర‌స్తుతం స్వామి , అమ్మ వార్ల ద‌ర్శ‌నం కోసం 5 కంపార్ట్ మెంట్ల‌లో వేచి ఉన్నారు. వీరికి ద‌ర్శ‌న స‌మ‌యం క‌నీసం 10 గంట‌లు ప‌ట్ట‌నుంద‌ని తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (TTD) వెల్ల‌డించింది. ఇదిలా ఉండగా భ‌క్తులు స్వామికి కానుక‌లు, విరాళాల రూపేణా రూ. 4 కోట్ల 20 ల‌క్ష‌ల ఆదాయం స‌మ‌కూరింది.

ఇదిలా ఉండ‌గా భ‌క్తులు పెద్ద ఎత్తున త‌ర‌లి రావ‌డంతో టీటీడీ చైర్మ‌న్ సుబ్బారెడ్డి, కార్య నిర్వ‌హ‌ణ అధికారి ఏవీ ధ‌ర్మా రెడ్డి ఆధ్వ‌ర్యంలో విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. ఎవ‌రికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చ‌ర్య‌లు తీసుకున్న‌ట్లు ఈవో స్ప‌ష్టం చేశారు. రోజు రోజుకు తిరుమ‌ల‌కు భ‌క్తుల ర‌ద్దీ పెర‌గ‌డం విశేషం.

Also Read : Rahul Gandhi : బీఆర్ఎస్ బీజేపీకి బీ టీమ్ – రాహుల్

Leave A Reply

Your Email Id will not be published!