Bandi Sanjay Slams : కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒక్క‌టే – బండి

రాహుల్ గాంధీ ముందే తోపులాట

Bandi Sanjay Slams : ఖ‌మ్మంలో జ‌రిగిన కాంగ్రెస్ స‌భ‌ను ఉద్దేశించి షాకింగ్ కామెంట్స్ చేశారు భార‌తీయ జ‌న‌తా పార్టీ చీఫ్ బండి సంజ‌య్. ఆయ‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా సోమ‌వారం స్పందించారు. ఆ పార్టీకి సంబంధించి వేదిక‌పై ప్ల కార్డులు ప్ర‌ద‌ర్శించేందుకు నేత‌లు పోటీ ప‌డడాన్ని ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు. నేత‌ల మ‌ధ్య ఐక్య‌త లేని ఆ పార్టీ రాష్ట్రంలో ఎలా అధికారంలోకి వ‌స్తుంద‌ని ప్ర‌శ్నించారు. జ‌నం కాంగ్రెస్ ను న‌మ్మే స్థితిలో లేరన్నారు. ఆ పార్టీకి ఓటు వేసి ఎమ్మెల్యేల‌ను గెలిపించినా వాళ్లు న‌మ్మ‌కంగా ఆ పార్టీలో ఉండ‌ర‌న్న‌ది తేలి పోయింద‌న్నారు బండి సంజ‌య్(Bandi Sanjay).

వాళ్లు అమ్ముడు పోవ‌డం ఖాయ‌మ‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. అందుకే రాష్ట్రంలో బీఆర్ఎస్ , కాంగ్రెస్ ఒక్క‌టేన‌ని పేర్కొన్నారు. పైకి విమ‌ర్శ‌లు చేయ‌డం ఆ త‌ర్వాత ఒక‌రినొక‌రు ప‌ల‌క‌రించ‌డం కోవ‌డం షరా మామూలేన‌ని అన్నారు. కాంగ్రెస్ నేత‌లు జోక‌ర్లంటూ ఎద్దేవా చేశారు బీజేపీ స్టేట్ చీఫ్‌. వీళ్ల మ‌ధ్య స‌యోధ్య లేద‌ని ఇక రాష్ట్రంలో పాల‌న ఎలా సాగిస్తారంటూ ప్ర‌శ్నించారు.

బీఆర్ఎస్ కు నాయ‌కుల‌ను స‌ర‌ఫ‌రా చేసే పార్టీ కాంగ్రెస్ అంటూ మండిప‌డ్డారు బండి సంజ‌య్. మొద‌టి సారి గెలిస్తే ఎమ్మెల్యేలు జంప్ అయ్యారు. రెండోసారి గెలిస్తే పార్టీకి వెన్నుపోటు పొడిచారంటూ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి అంత సీన్ లేద‌ని పేర్కొన్నారు. రాబోయే ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు బీజేపీని కోరుకుంటున్నార‌ని స్ప‌ష్టం చేశారు.

Also Read : KTR Slams : అవినీతికి కేరాఫ్ అడ్ర‌స్ కాంగ్రెస్

Leave A Reply

Your Email Id will not be published!