MLC Kavitha : సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ ను వెనక్కి తీసుకున్న కవిత

కవిత పిటిషన్ ఉపసంహరణకు ఈడీ అడ్వకేట్ ఎస్వీ రాజు అభ్యంతరం చెప్పలేదు

MLC Kavitha  : ఈడీ కేసుల్లో మహిళలపై విచారణ నిర్వహించాలని, ఢిల్లీ మద్యం కేసులో అరెస్ట్ చేయొద్దని మార్గదర్శకాలు కోరుతూ దాఖలైన పిటిషన్‌ను బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత తరఫు న్యాయవాది ఉపసంహరించుకున్నారు. ఈ పిటిషన్‌ను ఉపసంహరించుకునేందుకు జస్టిస్ బేల ఎం. త్రివేది అంగీకరించారు. ఢిల్లీలో మద్యం కేసులో అరెస్టు కావడంతో కవిత గతంలో వేసిన పిటిషన్ ఫలించలేదని ఆమె తరపు న్యాయవాది విక్రమ్ చౌదరి వాదించారు.

MLC Kavitha Case Updates

కవిత పిటిషన్ ఉపసంహరణకు ఈడీ అడ్వకేట్ ఎస్వీ రాజు అభ్యంతరం చెప్పలేదు. ఇదిలా ఉండగా.. ఎమ్మెల్సీ కవిత అరెస్టు చట్ట విరుద్ధమంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. కవిత తరపున వాదించాల్సిన సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ మరో కోర్టులో బిజీగా ఉండడంతో కోర్టు విచారణను ఉదయం 11 గంటలకు వాయిదా వేసింది. ఈ క్రమంలో కవిత అరెస్ట్‌పై దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో ఉదయం 11 గంటలకు విచారణ జరగనుంది.

Also Read : TDP – JSP: “ప్రజాగళం” సభలో పోలీసుల తీరుపై ఎన్డీఏ కూటమి నేతల ఆగ్రహం!

Leave A Reply

Your Email Id will not be published!