మోదీ 12 ఏళ్ల పాల‌నా కాలం దేశం అస్త‌వ్య‌స్తం

సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన రేణుకా చౌద‌రి

రాయ్ పూర్ : కాంగ్రెస్ పార్టీకి చెందిన పార్ల‌మెంట్ స‌భ్యురాలు రేణుకా చౌద‌రి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆమె ఛ‌త్తీస్ గ‌ఢ్ లో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్బంగా రాయ‌పూర్ లో మీడియాతో మాట్లాడారు. భార‌త దేశంలో ప్ర‌ధాన‌మంత్రి గా న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీ కొలువు తీరి 12 ఏళ్లు పూర్త‌యింది. దీనిపై స్పందించారు ఎంపీ. ఆయ‌న ఏం సాధించార‌ని క‌మ‌ల‌నాథులు, బీజేపీకి చెందిన నేత‌లు, కార్య‌క‌ర్త‌లు సంబురాలు జ‌రుపుకుంటున్నార‌ని ప్ర‌శ్నించారు. గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా దేశం అన్ని రంగాల‌లో వెనుకబ‌డి పోయింద‌న్నారు. 143 కోట్ల భార‌తీయుల ఆత్మ గౌర‌వాన్ని అమెరికా కాళ్ల కింద పెట్టాడ‌ని ఆరోపించారు. ఇందు కోసం సంబురాలు జ‌రుపుకుంటున్నారా అని ఎద్దేవా చేశారు ఎంపీ.

మోదీ త‌న ప‌వ‌ర్ ను కేవ‌లం ప్ర‌తిప‌క్షాల‌ను లేకుండా చేయాల‌ని చూశాడ‌న్నారు. అంతే కాదు దేశానికి మూల స్తంభాలైన నాలుగు స్థంభాల‌కు స్వేచ్ఛ అన్న‌ది లేకుండా చేసిన ఘ‌న‌త త‌న‌కే ద‌క్కుతుంద‌న్నారు రేణుకా చౌద‌రి. సంకుచిత మనస్తత్వం గురించి మేము పెద్దగా ఏమీ చెప్పలేమన్నారు మా పార్టీకి 130 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. వారు కేవలం 12 ఏళ్లుగా మాత్రమే అధికారంలో ఉండి, ‘కాంగ్రెస్ రహిత భారత్’ గురించి మాట్లాడుతున్నారు. అది ఎప్పటికీ సాధ్యం కాదు, ఎందుకంటే ఈ దేశ చరిత్రలోనూ, పునాదులలోనూ కాంగ్రెస్ పార్టీ లోతుగా పాతుకు పోయింద‌ని అన్నారు. . నేడు వారు ఏ విషయాల గురించి మాట్లాడుతున్నా, కాంగ్రెస్ నిర్మించిన పునాదిపై నిలబడే ఆ మాటలు అంటున్నారు. కాంగ్రెస్ వేసిన పునాదిపై వారు కేవలం పై అంతస్తులను మాత్రమే నిర్మిస్తున్నారని కుండ బ‌ద్ద‌లు కొట్టారు.

Leave A Reply

Your Email Id will not be published!