Muslim Women Comment : దైవ దర్శనం అందరికీ సమానం
మనుషులంతా ఒక్కటేనని తీర్పు
Muslim Women Comment : మనుషులు ఏర్పాటు చేసుకున్న ప్రార్థనా మందిరాల్లోకి మహిళలు వెళ్లలేని దుస్థితి భారత దేశంలో చోటు చేసుకోవడం సిగ్గు పడాల్సిన అంశం. శబరి మల ఆలయంతో పాటు దేశ వ్యాప్తంగా పేరొందిన గుళ్లు ఉన్నాయి. సమాజంలో కీలకంగా ఉంటూ , దేశ అభివృద్దిలో పాలు పంచుకుంటూ , మానవ జాతి పునరుత్పత్తికి మూలంగా ఉన్న స్త్రీల(Womens) పట్ల ఇంకా వివక్ష కొనసాగుతూనే ఉంది. వాళ్లకు ప్రవేశం లేదంటూ కొందరు ఏర్పాటు చేసుకున్న మూఢా చారాలు, నమ్మకాలతో దూరంగా పెట్టేసే ప్రయత్నం జరుగుతూ వస్తోంది. కానీ మహిళలు కూడా అర్హులేనంటూ తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్(MK Stalin) సంచలన ప్రకటన చేశారు. అంతే కాదు ఆయన సీఎంగా కొలువు తీరాక మహిళలు కూడా పూజారులుగా పని చేయొచ్చంటూ వెల్లడించారు. ఇదంతా పక్కన పెడితే ఇంకా గుళ్లు, గోపురాల్లోకి రానివ్వని ఘటనలు ఎక్కడో ఒక చోట కొనసాగుతూ వస్తున్నాయి.
Muslim Women Comment Viral
ఇక ప్రార్థనా మందిరాలు మానవత్వానికి ప్రతీకలుగా ఉండాలని వాటిని ఈర్ష్యా ద్వేషాలకు, రాజకీయాలకు కేంద్ర బిందువులుగా మారిస్తే ఎలా అని ప్రశ్నించారు భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్. ఏ కులమైనా, ఏ మతమైనా అందరినీ ఒకే లాగా గౌరవించాలని, ప్రేమతో కలిసి జీవించేలా చూడాలని బోధిస్తుంది. మనుషుల మధ్య రాగ ద్వేషాలకు అతీతంగా సుహృద్భావంతో ముందుకు సాగేందుకు కావాల్సిన స్థైర్యాన్ని పెంపొందిస్తుంది. ఇవాళ ఈ దేశంలో ఎక్కడా లేని రీతిలో మతం పేరుతో దాష్టీకాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఓ సామాజిక వర్గానికి చెందిన మహిళను(Womens) సామూహికంగా అత్యాచారానికి గురి చేస్తే ..ఆమెకు న్యాయం చేయాల్సింది పోయి జీవిత ఖైదీలుగా ఉన్న వారిని బీజేపీ ప్రభుత్వం విడుదల చేసింది. ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతం మసీదుల్లోకి తమను కూడా ఎందుకు అనుమతించ కూడదంటూ కొందరు వారి తరపున కోర్టును ఆశ్రయించారు. ఎక్కడా లేని రీతిలో తమపై వివక్ష ఎందుకు ఉంటోందంటూ ప్రశ్నిస్తున్నారు.
తాజాగా నమోదైన పిల్ పై తెలంగాణ హైకోర్టు(High Court) సంచలన తీర్పు చెప్పింది. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేసింది. సభ్య సమాజానికి జీవిత కాలం గుర్తుండి పోయేలా సందేశం ఇచ్చింది. మహిళలు కూడా మనుషులే. వారు మన పట్ల ఎంతో బాధ్యతతో ఉన్నారు. వారు లేక పోతే కుటుంబ వ్యవస్థ చిన్నా భిన్నం అవుతుంది. ఈ దేశం ముందుకు సాగాలన్నా కావాల్సింది పరస్పర సహకారం. స్త్రీ, పురుషుల మధ్య సత్ సంబంధాలు , అర్థం చేసుకోలేక పోతే ఇక పురోభివృద్ది ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించింది కోర్టు.
అంతే కాదు దైవం అన్నది ఏ ఒక్కరి సొత్తు కాదు. లేదా ఏ ఒక్కరి సమూహానికి చెందినది కానే కాదంటూ స్పష్టం చేసింది. మహిళలు మనుషులే. వారికి అనుమతి లేదంటే వాళ్లను మనుషులుగా చూడడం లేదన్న మాటే. మసీదులైనా ఆలయాలైనా లేదా చర్చీలైనా లేక ఏ ప్రార్థనా మందిరాలైనా ఒక్కటే. పురుషులతో పాటే స్త్రీలకు సమాన హక్కులు ఉన్నాయి. ఈ దేశంలో ఎవరైనా సరే రాజ్యాంగానికి లోబడి ఉండాల్సిందే. ఇదే సమయంలో మహిళలు కూడా మసీదుల్లోకి వెళ్లేందుకు అర్హులేనంటూ సంచలన తీర్పు చెప్పింది. ఇకనైనా మారాల్సింది సమాజం కాదు..పురుషులేనని తేలి పోయింది.
Also Read : BRS Comment : ఎన్నుకుంటే పడగొడతారా..?