Papineni Sivasankar: తెలుగు నాట సుప్రసిద్ధ కవి
తెలుగు నాట సుప్రసిద్ధ కవి పాపినేని శివశంకర్
పాపినేని శివశంకర్
Papineni Sivasankar : పాపినేని శివశంకర్: 1953 నవంబర్ 6న గుంటూరు జిల్లా నెక్కల్లులో జన్మించిన పాపినేని శివశంకర్… తెలుగు నాట సుప్రసిద్ధ కవి, కథకులు, విమర్శకులు, సాహితీ ప్రముఖునిగా గుర్తింపు పొందారు. తాడికొండ బి.ఎస్.ఎస్.బి.కళాశాలలో తెలుగు అధ్యాపకులుగా, ప్రిన్శిపాల్ గా పనిచేసిన శివశంకర్ 2010 ఫిబ్రవరిలో పదవీవిరమణ చేశారు.
Papineni Sivasankar – శివశంకర్ రచనా ప్రస్థానం
శివశంకర్ ఆధునిక తెలుగు కవిత్వ ప్రపంచములో అగ్రశ్రేణి కవులలో ఒకరు. ఆలోచనలు, అనుభూతుల మేళవింపు శివశంకర్ కవిత్వంలో స్పష్టంగా కనిపిస్తోంది. అందులోని తాత్త్వికమైన లోతులు చదువరులను ఆలోచింపజేస్తాయి. ఇప్పటివరకు శివశంకర్(Papineni Sivasankar) రచించిన సుమారు 350 కవితలు, 55 చిన్న కథలు ఇంకా 220 వ్యాసాలు వివిధ పత్రికలలో ప్రచురితమయ్యాయి. 1990 నుంచి తెలుగు ఉత్తమ కథా సంకలనాలను ‘కథా సాహితి’ పేరుతో వాసిరెడ్డి నవీన్ తో కలిసి ఈయన ప్రతి సంవత్సరమూ ప్రచురిస్తున్నారు. ఆయన రాసిన రజనీగంధ అనే కవితా సంపుటికి గాను కేంద్ర ప్రభుత్వం 2016లో కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారం ప్రకటించింది. దీనితో పాటు శివశంకర్…. మహాకవి గుర్రం జాషువా అవార్డు, సినారే కవితా పురష్కారం, దేవరకొండ బాలగంగాధర్ తిలక్ అవార్డులతో పాటు ఏన్నో అవార్డులు అందుకున్నారు. ‘సాహిత్యం-మౌలిక భావనలు’ అనే అంశంపై వీరు చేసిన ఉత్తమ పరిశోధనకు ఆచార్య తూమాటి దొణప్ప స్వర్ణపతకం లభించింది.
శివశంకర్ రచనలు
శివశంకర్ రచించిన ఐదు కవితా సంపుటాలు స్తబ్దత – చలనం, ఒక సారాంశం కోసం, ఆకుపచ్చని లోకంలో, ఒక ఖడ్గం – ఒక పుష్పం, మరియు రజనీగంధ… రెండు కథా సంపుటాలు మట్టి గుండె, సగం తెరిచిన తలుపు వెలవడ్డాయి. చినుకు, కథాసాహితి, విస్మృత కథ, రైతు కవిత, కవిత సంపుటాలకు శివశంకర్ సంపాదకత్వ బాధ్యత నిర్వహించారు.
Also Read : Perugu Ramakrishna: అంతర్జాతీయ తెలుగు కవి