CM YS Jagan: సీఎం జగన్‌ పై దాడి చేసిన నిందితుల్ని పట్టిస్తే పోలీసుల నగదు బహుమతి !

సీఎం జగన్‌ పై దాడి చేసిన నిందితుల్ని పట్టిస్తే పోలీసుల నగదు బహుమతి !

CM YS Jagan: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం వేశారు. ఈ క్రమంలో దాడికి సంబంధించి నిందితుల వివరాల చెప్పిన వారికి ఎన్టీఆర్‌ జిల్లా పోలీసులు నగదు బహుమతిని ప్రకటించారు. సీఎం జగన్‌(CM YS Jagan) పై గుర్తు తెలియని వ్యక్తి/వ్యక్తులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడిలో సీఎం జగన్ తో పాటు మాజీ మంత్రి వెల్లంపల్లికి ముఖం భాగంగా స్వల్ప గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.

CM YS Jagan…

ఈ నేపథ్యంలో దాడికి పాల్పడిన గురించి ఏదైనా సమాచారం ఉన్నా… తెలిసినా తమకు తెలపాలని ఎన్టీఆర్‌ జిల్లా పోలీసులు కోరారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌పై దాడికి సంబంధించి కచ్చితమైన సమాచారం ఇచ్చిన వారిని నగదు బహుమతి ఇస్తామని స్పష్టం చేశారు. దాడిపై సమాచారం ఇచ్చిన వారికి రూ.2లక్షలు నగదు బహుమతి ఇవ్వనున్నట్టు పోలీసులు తెలిపారు. వారి వివరాలను ఈ కింది నంబర్లకు సమాచారం ఇవ్వాలని సూచించారు. వివరాల తెలిపిన వారి పేపర్లను గోప్యంగా ఉంచుతామని పోలీసులు హామీ ఇచ్చారు.

ఫోన్‌ నంబర్లు ఇవే..

9490619342, 9440627089

Also Read : Nandamuri Balakrishna: మూడు రాజధానుల పేరుతో జగన్ రైతులను నట్టేటా ముంచారు – బాలకృష్ణ

Leave A Reply

Your Email Id will not be published!