#KrishnamRaju : పెద‌నాన్న జోరు అబ్బాయి హుషారు

రెబ‌ల్, రైజింగ్ స్టార్ల సంద‌డి

Krishnam Raju : విల‌క్ష‌ణ న‌టుడిగా కృష్ణం రాజుకు పేరుంది. రౌద్రాన్ని ప‌లికించ‌డంలో ఆయ‌న‌కు ఆయ‌నే సాటి. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ‌, శోభ‌న్ బాబుల కాలంలో ఈ రెబ‌ల్ స్టార్ సినిమాలు స‌క్సెస్ అయ్యాయి.

ఆయ‌న‌కు లెక్క‌లేనంత అభిమానులు ఉన్నారు. ఎక్కువ‌గా ప‌బ్లిసిటీ కోసం వెంప‌ర్లాడే మెంటాలిటీ కాదు ఆయ‌న‌ది. ఇక ప్యాన్ ఇండియ‌న్ హీరో రైజింగ్ స్టార్, డార్లింగ్ ప్ర‌భాస్ కృష్ణంరాజుకు స్వ‌యనా కొడుకు.

అంటే ప్ర‌బాస్ కు పెద‌నాన‌. వీరిద్ద‌రూ క‌లిసి గ‌తంలోనే న‌టించారు. రెబ‌ల్, బిల్లా వంటి సినిమాల్లో న‌టించారు. ఆ త‌ర్వాత మ‌ళ్లీ కాంబినేష‌న్ కుద‌ర‌లేదు. అందుకు త‌గ్గ పాత్ర‌లు దొర‌క‌లేదు.

అయితే ప్ర‌భాస్, కృష్ణంరాజుల(Krishnam Raju)‌ను ఒకే వేదిక‌పై చూసే రోజు ద‌గ్గ‌ర‌లోనే ఉంది. ప్ర‌భాస్ అప్ క‌మింగ్ మూవీ రాధే శ్యామ్ సినిమాలో కృష్నంరాజు ఒ గెస్ట్ రోల్ లో న‌టిస్తున్నారు.

అందులో భాగంగా ఇట‌లీలో జ‌రుగుతున్న షూటింగ్ లో పెద‌నాన్న కృష్ణంరాజుతో క‌లిసి ప్ర‌భాస్ ఒక పాట‌కు స్టెప్పులు వేశాడు.

తాజాగా ఆ ఫోటోను కృష్ణంరాజు సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నారు.

కేజీఎఫ్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో స‌లార్ చేస్తున్నాడు ప్ర‌భాస్. ఇది పూర్తి కావ‌చ్చింది.త్వ‌ర‌లోనే విడుద‌ల‌కు రెడీ అవుతోంది.

ఇక రాధాకృష్ణ కుమార్ డార్లింగ్ ప్ర‌భాస్ ను ప్ర‌త్యేకంగా చూపిస్తున్నాడు.

ఈ సినిమా అంతా ల‌వ్ మీదే న‌డుస్తుంది. తాజాగా రాధే శ్యామ్ టీజర్ విడుద‌లైంది. దానిని ప్ర‌భాస్ అభిమానులు తెగ చూస్తున్నారు.

ఇప్ప‌టికే టీజర్ కు విప‌రీత‌మైన రెస్పాన్స్ వ‌చ్చింది.

ఇక తండ్రీ కొడుకుల మ‌ధ్య ఆస‌క్తిక‌ర ఫోటో ఇపుడు వైర‌ల్ అవుతోంది. ఏది ఏమైనా ప్ర‌భాస్ మాత్రం వెరీ డిఫ‌రెంట్.

No comment allowed please