#AmbaniAdaani : కార్పొరేట్ మ‌యం రాజ‌కీయం

మనీ మీడియా మాఫియా ఇదే రాజ‌కీయం

Ambani Adaani : రాజ‌కీయం అంటే ర‌ణ‌రంగమే. యుద్ధంలో తుపాకులుంటాయి. ఆయుధాలుంటాయి. అణ్వాయుధాలు ఉంటాయి. కానీ ఇవేవీ లేకుండానే మ‌నుషులను చంప‌డం. వారిని లొంగ దీసుకోవ‌డం. బెదిరింపుల‌కు దిగ‌డం లేదా హ‌త్య‌ల‌కు పాల్ప‌డం. కాదంటే అడ్ర‌స్ లేకుండా చేయ‌డం.

ఇవ‌న్నీ పాలిట్రిక్స్ లో కొత్త కాదు. దానిని చూసిన వాళ్ల కంటే అనుభ‌వించిన వాళ్ల‌కే ఎక్కువ దాని వాల్యూ ఏమిటో.

దాని కున్న ప‌వ‌ర్ ఏమిటో తెలుస్తుంది. ఒక‌ప్పుడు రాజ‌కీయం అంటే ప్ర‌జాసేవ‌.

కానీ ఇపుడు అదో వ్యాప‌కం. అదో దందా. అదో ప‌వ‌ర్ ఫుల్ మేనేజ్ మెంట్. రాజ‌కీయాలంటే రోత అని భావించే వాళ్ల‌కు ఇపుడు అదో స్వ‌ర్గ ధామం కూడా.

ఎలాంటి ర‌క్తపు చుక్క‌లు లేకుండానే అధికారాన్ని చెలాయించ‌డం. ఎదుటి వారిని అన‌డం కంటే ప్ర‌త్య‌ర్థుల‌ను చిత్తు చేయ‌డం.

వారి ఎత్తుల‌కు పై ఎత్తులు వేయ‌డం లాంటిదే. ఒక‌ర‌కంగా చెప్పాలంటే ఇది వైకుంఠపాళి. అంత‌కంటే ఎక్కువ‌గా చ‌ద‌రంగం అనాల్సి ఉంటుంది. గ‌తంలో విలువ‌లండేవి. ఒక‌రిపై మ‌రొక‌రికి గౌర‌వం ఉండేది.

ఒక‌రి ప‌ట్ల ఇంకొక నాయ‌కుడు ప్రేమ‌ను క‌న‌బ‌రిచే సంస్కారం ఉండేది. ఇపుడు రాజీయం పేష‌న్. హ‌త్య‌ల‌కు..దోపిడీల‌కు..మోసాల‌కు..అబ‌ద్దాల‌కు..వెన్నుపోట్ల‌కు కేరాఫ్ గా మారి పోయింది. వెహికిల్స్ ఒక స్టేట‌స్.

న‌యానో భ‌యానో ఎమైనా స‌రే..బ‌తికామా లేదా..ప‌ద‌వి ద‌క్కించుకున్నామా లేదా. ఇదే న‌యా జ‌న‌రేష‌న్ రాజ‌కీయం. ఇందుకు ఎవ్వ‌రూ మిన‌హాయింపు కాదు.

ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో స‌ర్పంచ్ ప‌ద‌వికి 20 ల‌క్ష‌ల నుంచి 50 ల‌క్ష‌ల దాకా ధ‌ర ప‌లుకుతోంది.

డిజిట‌ల్ మీడియా రాజ్య‌మేలుతోంది. పొలిటిక‌ల్ మేనేజ్ మెంట్ గురువుల‌కు, స్ట్రాట‌జిస్ట్ ల‌కు, బాబాలు, స్వామీజీలు, కార్పొరేట్ కంపెనీల అధినేత‌లు, వ్యాపార‌స్తులు, రౌడీలు, గూండాలు, రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారులు..ఇక చెప్పుకుంటూ పోతే చాంతాడ‌వుతుంది.

ఎంత చెప్పినా ఎంతో కొంత ఇంకా మిగిలే ఉంటుంది దేశంలోని పాలిటిక్స్ గురించి. ఇక మ‌న రాష్ట్రంలో ఈ రాజ‌కీయం అరాజ‌కీయ‌మై పోయింది. రియ‌ల్ ఎస్టేట్ అడ్డాగా తెలంగాణ విరాజిల్లుతోంది. తాజాగా కిడ్నాప్ దాకా చేరుకుంది.

అంటే భూమి విలువ పెరుగుతోంది. దానితో పాటు మాఫియా కింగ్ మేక‌ర్లు వెనుక నుంచి ద‌ర్జాగా ప‌ని కానిచ్చేస్తున్నారు. ప్ర‌తి ప‌ద‌వికి ఒక రేటు. కావాలంటే త‌ప్పు కోవాల్సిందే. అర్హ‌త‌లు అక్క‌ర్లేదు. అనుభ‌వంతో ప‌ని లేదు. ఎట్టాగైనా స‌రే ప‌వ‌ర్ కావాలి.

అధికారం మ‌న చెప్పు చేతుల్లో ఉండాలి. దొర‌త‌నం మ‌ళ్లీ మొద‌టికొచ్చింది.

ఏ తెలంగాణ దొర గ‌డీల‌ను దాటుకుని ముందుకు వెళ్లిందో. ఏ న‌వాబు దాష్టీకాల‌ను వ‌ద్ద‌నుకుందో అది మ‌ళ్లీ న‌యా రూపంలో మ‌న ముందుకు వ‌చ్చింది.

ఇది టెక్నాల‌జీకి అర్థం కాని రాజ‌కీయం. దొర‌త‌నం న‌ర‌న‌రాన జీర్ణించుకున్న వైనం. ఇది కులం, మ‌తం..ఎయిడ్స్ వ్యాధి కంటే ప్ర‌మాద‌క‌ర‌మైన‌ది. ఇది చాప కింద నీరులా చేరిపోయింది. దీనిని ఆప‌టం ఎవ‌రి త‌ర‌మూ కాదు.

పాల‌కులు మారినా, ప్ర‌భుత్వాలు మారినా ..త‌రాలు గ‌డిచినా అధికారులు మార‌రు.

వారి ప‌నితీరూ మార‌దు. ఎవ‌రికి తోచిన రీతిలో వాళ్లే కుల ప్రాతిప‌దిక‌న మ‌న కోసం ప‌ని చేసేందుకు వ‌స్తారు. అదే జోరు..అదే హోరు..అదే ద‌ర్పం..అదే సంద‌ర్భం.

వీళ్ల‌నా మ‌నం కోరుకున్న‌ది. వీళ్ల‌నా మ‌నం ఆశించింది. వీళ్ల‌నా మ‌నం న‌మ్ముకున్న‌ది.

అందుకే మ‌న బ‌తుకులు ఇట్లా ఏడ్చిన‌వి. పాల‌కులు ఎప్పుడూ త‌మకు అధికారం ఉండాల‌ని కోరుకుంటారు. త‌మ అనుచ‌ర గ‌ణాన్ని, వేగుల‌ను ఏర్పాటు చేసుకుంటారు.

ఇక భ‌జ‌న బృందం ఉండ‌నే ఉంటుంది.

ఒక్కో పార్టీకి ఒక్కో పార్టీకి ఒక్కో స్వామీజీ. ధ‌ర్మాన్ని ప్ర‌వ‌చించి..బోధ‌న‌లు చేసే స్వాములు కోట్ల‌కు ప‌డగ‌లెత్తారు.

ఇపుడు వారే శాసిస్తున్నారు. వారే రియ‌ల్ ఎస్టేట్ మాయ‌గాళ్ల‌కు వెన్ను ద‌న్నుగా ఉంటున్నారు.

ఇక కార్పొరేట్ శ‌క్తులు ఎప్పుడో దేశాన్ని క‌బ‌ళించాయి.

అందుకేగా కాషాయ స‌ర్కార్ కార్పొరేట్ జ‌పం చేస్తోంది. అందుకేగా ప్రైవేటీక‌ర‌ణ అయితే దేశం బాగుప‌డుతోందంటూ స‌న్నాయి నొక్కులు నొక్కుతోంది. కావాల్సింది..జాగురుక‌త‌తో ఉండాల్సింది జ‌న‌మే.

లేక పోతే రేప‌టి రోజు మ‌న‌ది కాకుండా పోతుంది. మ‌నల్ని అమ్మే రోజు ద‌గ్గ‌ర‌లో ఉంటుంద‌న్న‌ది గుర్తించాలి.

లేక పోతే చావుకు సైతం ప‌ర్మిష‌న్ తీసుకోవాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డుతుంది. త‌స్మాత్ జాగ్ర‌త్త‌.

No comment allowed please