Ratan Tata Good Fellows : గుడ్ ఫెలోస్ కు రతన్ టాటా భరోసా
ఎవరీ శాంతను నాయుడు ఏమిటా కథ
Ratan Tata Good Fellows : భారతీయ వ్యాపార దిగ్గజం రతన్ టాటా(Ratan Tata) సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆయన గత కొంత కాలం నుంచి దేశంలో కొత్తగా కొలువు తీరిన స్టార్టప్ (అంకురాలు)లకు చేయూతనిస్తూ వస్తున్నారు.
నూతన ఆలోచనలతో సమాజానికి ఉపయోగ పడుతూ, మార్గదర్శకంగా ఉండే వాటిపై ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు టాటా. తాజాగా ఆయన వార్తల్లో నిలిచారు.
వృద్దుల సంక్షేమం కోసం వినూత్నంగా, ఇతోధికంగా సేవలు అందిస్తూ వస్తున్న స్టార్టప్ కంపెనీ గుడ్ ఫెలోస్ లో పెట్టుబడి పెట్టారు. దీనిని కార్నెల్ వర్సీటీలో చదువుకున్న 25 ఏళ్ల యువకుడు శాంతను నాయుడు ఏర్పాటు చేశారు.
ఈ అంకుర కంపెనీ వృద్దులను నిత్యం ఆనందంలో ఉంచేందుకు ప్రయత్నం చేస్తుంది. యువత వారితో అనుసంధానం అవుతుంది. వారితో ఆటలు ఆడుతూ ఉత్సాహ పరుస్తుంది.
యువ, విద్యావంతులైన గ్రాడ్యుయేట్ల ద్వారా సీనియర్లకు ప్రామాణికమైన, అర్థవంతమైన సాంగత్యాన్ని అందించడం ఈ స్టార్టప్ లక్ష్యం. సేవకు సభ్యత్వం పొందిన సీనియర్లను గ్రాండ్ పాల్స్ అని పిలుస్తారు.
ఈ వెంచర్ లో పెట్టుబడిదారుడైన రతన్ టాటా సమక్షంలో గుడ్ ఫెలోస్ ను ప్రారంభించారు. గుడ్ ఫెలోస్(Good Fellows) ముంబై, పూణేలలో అందుబాటులో ఉంది. త్వరలోనే చెన్నై, బెంగళూరు లలో దీనిని ప్రారంభించనున్నారు.
యువ గ్రాడ్యుయేట్ల నుండి 800 కంటే పైగా దరఖాస్తులను స్వీకరించింది. వీరిలో 20 మందితో కూడిన టీం వృద్దుల సేవలో పాలుపంచుకుంది.
సీనియర్ సిటిజన్లకు సంబంధించి దిగుడ్ ఫెలోస్.ఇన్ ద్వారా సైన్ అప్ చేసుకుంటే సేవలు పొందవచ్చు. లేదా +91 8779524307కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.
Also Read : మాంచెస్టర్ యునైటెడ్ ను కొనుగోలు చేస్తా