Sadanand Vasant Date: 26/11 ఉగ్రదాడి నిందితుడు కసబ్ ను పట్టుకున్న సదానంద్‌ దాతెకు ఎన్‌ఐఏ పగ్గాలు !

26/11 ఉగ్రదాడి నిందితుడు కసబ్ ను పట్టుకున్న సదానంద్‌ దాతెకు ఎన్‌ఐఏ పగ్గాలు !

Sadanand Vasant Date: మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ATS) అధిపతిగా ఉన్న సదానంద్‌ వసంత్‌ దాతెను ‘నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ’ (NIA) డైరెక్టర్‌ జనరల్‌గా నియమిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం ఎన్ఐఏ డైరెక్టర్ గా ఉన్న దినకర్‌ గుప్తా పదవి కాలం ఈ నెల 31తో ముగుస్తుంది. దీనితో ఆయన స్థానంలో 1990 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి వసంత్‌ ను నియమించింది. వసంత్ 2026 డిసెంబరు 31 వరకు ఈ పదవిలో కొనసాగనున్నారు. మహారాష్ట్రలోని నిరుపేద కుటుంబానికి చెందిన సదానంద్‌ వసంత్‌ దాతె పుణెలో కొన్నాళ్లు దినపత్రికలు విక్రయిస్తూ చదువును కొనసాగించారు. కష్టపడి పోలీసు శాఖలో ఉన్నతాధికారిగా ఉద్యోగం సంపాదించిన వసంత్‌ దాతె… సీబీఐలో డీఐజీగా… సీఆర్ఫీఎఫ్ లో డీజీ (ఆపరేషన్స్) గా పనిచేసారు.

26/11 ఉగ్రదాడి పేరొందిన ముంబై బాంబు పేలుళ్ల (2008 నవంబరు 26) ఘటనలో కీలక ఉగ్రవాదులు అజ్మల్‌ కసబ్‌, అబు ఇస్మాయిల్‌ లను సదానంద్‌ వసంత్‌(Sadanand Vasant Date) దాతె పట్టుకున్నారు. అప్పుడు ఆయన ముంబయి అదనపు పోలీసు కమిషనర్‌ గా ఉన్నారు. ఉగ్రవాదులు విసిరిన గ్రనేడ్‌ పేలి… కాళ్లూచేతులకు తీవ్రగాయాలై, చాలారక్తం కోల్పోయి తాను స్పృహతప్పి పడిపోయేంతవరకు వారితో పోరాడాడు. గ్రనేడ్‌ తునకలు శరీరాన్ని చీల్చినా వెనక్కి తగ్గకుండా కాల్పులు జరుపుతూ, సీనియర్‌ అధికారులకు ముఖ్యమైన సమాచారం చెబుతూ ఎదురుదాడి పనిని సులభతరం చేశారు. ఆనాటి సాహసోపేత చర్యకు గానూ ఆయన రాష్ట్రపతి పోలీసు పతకాన్ని కూడా అందుకున్నారు. ఉగ్రదాడుల కేసుల దర్యాప్తు నిపుణుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ముంబయి ఘటన అనంతరం ఉగ్రదాడుల నిర్మూలనకు ఎన్‌ఐఏ ఆవిర్భవించగా 16 ఏళ్ల తర్వాత ఇప్పుడు దాని పగ్గాలు ఆయన చేతికి దక్కాయి. అధునాతన ఆయుధాలను అలవోకగా వినియోగించగలిగే సామర్థ్యం ఉన్న వసంత్‌ దాతె… మరాఠీలో ఒక పుస్తకం కూడా రాశారు.

Sadanand Vasant Date – ఎన్‌డీఆర్‌ఎఫ్‌ అధిపతిగా పీయూష్‌ ఆనంద్‌

‘నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్’ (ఎన్‌డీఆర్‌ఎఫ్‌) అధిపతి అతుల్‌ కర్వాల్‌ స్థానంలో పీయూష్‌ ఆనంద్‌ ను కేంద్రం నియమించింది. ఆనంద్‌ ప్రస్తుతం సీఐఎస్‌ఎఫ్‌ ప్రత్యేక డీజీగా ఉన్నారు. ‘బ్యూరో ఆఫ్‌ పోలీస్‌ రీసెర్చ్‌, డెవలప్‌మెంట్‌’ డైరెక్టర్‌ జనరల్‌గా రాజస్థాన్‌ క్యాడర్‌కు చెందిన 1990 బ్యాచ్‌ ఐపీఎస్‌ రాజీవ్‌ కుమార్‌ శర్మ నియమితులయ్యారు. ఎస్‌పీజీ అదనపు డైరెక్టర్‌ జనరల్‌ గా ఎస్‌.సురేశ్‌ను నియమించారు.

Also Read : MP Ganeshamurthi: లోక్‌ సభ ఎన్నికల టికెట్‌ రాలేదని మనస్తాపానికి గురై ఎంపీ ఆత్మహత్య !

Leave A Reply

Your Email Id will not be published!