డిసెంబర్ 1 నుంచి 5 వరకు స్లాటెడ్ సర్వ దర్శనం టోకెన్లు

ఈ-డిప్ ద్వారా కేటాయిస్తామ‌ని ప్ర‌క‌టించిన టీటీడీ

తిరుమ‌ల : కోట్లాది మంది శ్రీ‌వారి భ‌క్తుల‌కు తీపి క‌బురు చెప్పింది తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం స్పెసిపైడ్ అథారిటీ చైర్మ‌న్, ఈవో ముద్దాడ ర‌విచంద్ర‌. ఎంతగానో నిరీక్షిస్తున్న స‌మ‌యం రానే వ‌చ్చింది. వైకుంఠ ఏకాద‌శి సంద‌ర్బంగా ద‌ర్శ‌నం చేసుకునే భాగ్యాన్ని క‌ల్పించింది. ఇందుకు సంబంధించి శుక్ర‌వారం కీల‌క అప్ డేట్ ఇచ్చింది. తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 20 నుంచి 29వ తేదీ వరకు నిర్వహించనున్న వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి వివిధ దర్శన టికెట్లు, టోకెన్ల విడుదల తేదీల వివరాలు వెల్ల‌డించారు. న‌వంబ‌ర్ 28న శ‌నివారం ఉదయం 10 గంటలకు శ్రీవాణి దర్శన టికెట్ల కోటా విడుదల చేస్తారు. 30న ఉదయం 10 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల చేయ‌నున్నారు.

ఇదిలా ఉండ‌గా డిసెంబర్ 1 నుంచి 5వ తేదీ వ‌ర‌కు ఐదు రోజుల పాటు వైకుంఠ ద్వారా ద‌ర్శ‌నానికి సంబంధించి న‌మోదుకు ఛాన్స్ ఇచ్చారు. ఉదయం 10 గంటల నుంచి డిసెంబర్ 5వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు వైకుంఠ ఏకాదశి, ద్వాదశి తొలి రెండు రోజులకు సంబంధించిన స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ల కోసం భక్తులు ఈ-డిప్‌లో నమోదు చేసుకోవచ్చు అని తెలిపారు ఈవో. డిసెంబర్ 7న‌ మధ్యాహ్నం 3 గంటలకు ఈ-డిప్ ద్వారా స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ల కేటాయిస్తామ‌న్నారు. . డిసెంబర్ 8వ తేదీ ఉదయం 10 గంటలకు దాతల దర్శన కోటా టికెట్ల విడుదల చేస్తామ‌ని తెలిపారు .

వైకుంఠ ఏకాదశి, ద్వాదశి తొలి రెండు రోజులైన డిసెంబర్ 20, 21 తేదీల్లో ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేయడం జరిగిందన్నారు ముద్దాడ ర‌విచంద్ర‌. ఈ రెండు రోజుల్లో అధిక సంఖ్యలో సామాన్య భక్తులకు స్వామివారి దర్శనం కల్పించేందుకు స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లను ఈ-డిప్ విధానం ద్వారా ఆన్‌లైన్‌లో కేటాయించనున్నట్లు తెలిపారు. అయితే ఈ రెండు రోజులకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను కూడా రద్దు చేయడం జరిగిందన్నారు.

భక్తులు దర్శన టికెట్లు, టోకెన్లను టీటీడీ అధికారిక వెబ్‌సైట్ https://ttdevasthanams.ap.gov.in ద్వారా మాత్రమే బుక్ చేసుకోవాలని టీటీడీ ఈవో కోరారు.

Leave A Reply

Your Email Id will not be published!