మే నెలలో టీటీడీ అనుబంధ‌ ఆల‌యాల‌లో విశేష ఉత్సవాలు

తిరుచానూరు శ్రీపద్మావతీ అమ్మవారి ఆలయంలో కూడా

తిరుప‌తి : టీటీడీ కీల‌క ప్ర‌ట‌న చేసింది. మే నెల‌లో తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఆల‌యంతో పాటు అనుబంధ ఆల‌యాల‌లో కూడా విశేష ఉత్స‌వాలు నిర్వ‌హించ‌నున్న‌ట్లు వెల్ల‌డించింది. ⁠మే 1, 15, 22, 29వ తేదీల‌లో శుక్ర‌వారం సంద‌ర్భంగా సాయంత్రం 6 గంట‌లకు తిరుచ్చి ఉత్సవం జ‌రుగుతుంది. 1న వ‌సంతోత్స‌వాల‌లో భాగంగా ఉద‌యం 9.30 గంట‌లకు అమ్మ‌వారి స్వ‌ర్ణ ర‌థం ఊరేగింపు ఉంటుంది.
2వ తేదీన‌ అమ్మ‌వారి ఆల‌యంలో వ‌సంతోత్స‌వాలు ముగుస్తాయి. మే 8న ఉత్తరాషాడ నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6.45 గంట‌లకు ఆల‌య మాడ వీధులలో గజ వాహనంపై అమ్మవారు విహ‌రించి భ‌క్తుల‌ను అనుగ్ర‌హించ‌నున్నారు.

శ్రీ సుందరరాజ స్వామి ఆలయంలో మే 13న ఉత్తర భద్ర నక్షత్రం సందర్భంగా రాత్రి 7 గంట‌లకు స్వామివారు తిరుచ్చిపై ఆల‌య నాలుగు మాడ వీధులలో విహరించి అనుగ్ర‌హించ‌నున్నారు . శ్రీ బ‌ల‌రామ‌కృష్ణ స్వామి ఆలయంలో మే 18వ తేదీ రోహిణి న‌క్ష‌త్రం సంద‌ర్బంగా శ్రీ కృష్ణ స్వామి వారికి రాత్రి 7 గంట‌లకు తిరుచ్చి ఉత్సవం జ‌రుగ‌నుంది.శ్రీసూర్య నారాయణ స్వామి ఆలయంలో మే 27న హస్త నక్షత్రం సందర్భంగా శ్రీ సూర్య నారాయణ స్వామి వారికి సాయంత్రం 5 గంటలకు తిరుచ్చి ఉత్సవం నిర్వహించనున్నారు.శ్రీ శ్రీనివాస స్వామి ఆలయంలో మే 2, 9, 16, 23, 30వ‌ తేదీలలో శ్రీనివాస స్వామి మూలవర్లకు ఉదయం 8 గంట‌లకు అభిషేకం నిర్వ‌హిస్తారు.

అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మే 1, 8, 15, 22, 29వ తేదీలలో శుక్రవారం సందర్భంగా ఉదయం 7 గంటలకు వస్త్రలంకారణ సేవ, అభిషేకం జ‌రుగుతుంది. మే 5న ఉద‌యం 8 గంట‌ల‌కు అష్టదళ పాద పద్మారాధన సేవ. 9న శ్రవణా నక్షత్రం సందర్బంగా ఉదయం 10.30. గంటలకు కల్యాణోత్సవం. మే 13న ఉదయం 8 గంటలకు అష్టోత్తరశత కలశాభిషేకం.మే 3, 10, 17, 24, 31వ‌ తేదీలలో శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి వారికి ఉదయం 8.15 గంట‌లకు అభిషేకం జ‌రుగుతుంది.

Leave A Reply

Your Email Id will not be published!