Supreme Court of India: యూ ట్యూబర్ అరెస్ట్ పై సుప్రీం కోర్టు ఆగ్రహం !

యూ ట్యూబర్ అరెస్ట్ పై సుప్రీం కోర్టు ఆగ్రహం !

Supreme Court of India: ‘యూట్యూబ్‌ లో విమర్శలు చేసే ప్రతీ వ్యక్తినీ అరెస్టు చేసుకుంటూ పోతే… ఎన్నికల ముందు ఎంతమందిని జైల్లో పెడతారు ?’ అంటూ తమిళనాడు ప్రభుత్వంపై… సుప్రీంకోర్టు(Supreme Court of India) సోమవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. సామాజిక మాధ్యమాల్లో విమర్శలు చేసే ప్రతి ఒక్కరినీ జైలుకు పంపడం సరికాదని వ్యాఖ్యానించింది. అంతేకాదు యూట్యూబర్ బెయిల్ ను పునరుద్ధరిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇక పూర్తి వివరాల్లోకివ వెళితే… ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ పై విమర్శలు చేశాడన్న ఆరోపణలతో యూట్యూబర్‌ దురై మురుగన్‌ను 2021 అక్టోబరులో తమిళనాడు పోలీసులు అరెస్టు చేశారు. ఆ తరువాత అతడికి బెయిల్‌ మంజూరైంది. అయితే న్యాయస్థానం ఇచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేశాడన్న కారణంతో 2022లో మద్రాసు హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ అతడి బెయిల్‌ను రద్దు చేసింది. దీనితో మురుగన్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. మధ్యంతర బెయిల్‌ లభించింది. అప్పటినుంచి అతడు బయటే ఉన్నాడు.

Supreme Court of India Serious

ఈ క్రమంలోనే రెగ్యులర్‌ బెయిల్‌ రద్దును సవాల్‌ చేస్తూ యూట్యూబర్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై అత్యున్నత న్యాయస్థానం తాజాగా విచారణ జరిపింది. ఈసందర్భంగా తమిళనాడు ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేసింది. ‘యూట్యూబ్‌లో విమర్శలు చేసిన ప్రతిఒక్కరినీ అరెస్టు చేసుకుంటూపోతే.. ఎన్నికల ముందు ఎంతమందిని జైల్లో పెడతారు?’ అని ప్రశ్నించింది. కోర్టు ఇచ్చిన స్వేచ్ఛను అతడు దుర్వినియోగం చేసినట్లు ఎలాంటి సాక్ష్యాలు లేవని తెలిపింది. అందువల్ల అతడి రెగ్యులర్‌ బెయిల్‌ను పునరుద్ధరిస్తూ తీర్పు వెలువరించింది.

Also Read : Mamata Banerjee : దేశంలో ఉన్న ప్రతిపక్షాలను జైల్లో వేయడమే మోదీ నినాదం – మమతా బెనర్జీ

Leave A Reply

Your Email Id will not be published!