MLC Kavitha: ఢిల్లీ మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు చుక్కెదురు !

ఢిల్లీ మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు చుక్కెదురు !

MLC Kavitha: ఢిల్లీ మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు చుక్కెదురైంది. ఆమెకు మధ్యంతర బెయిల్‌ ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. తన చిన్న కుమారుడికి పరీక్షలు ఉన్నందున ఈ నెల 16 వరకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని రౌస్‌ అవెన్యూలోని సీబీఐ ప్రత్యేక కోర్టులో కవిత(MLC Kavitha) పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం… ఏప్రిల్ 4న తీర్పును రిజర్వ్ చేసింది.

MLC Kavitha Case

వాదనల సమయంలో కవిత మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌ ను ఈడీ వ్యతిరేకించింది. ఆమెకు బెయిల్ ఇస్తే కేసు దర్యాప్తుపై తీవ్ర ప్రభావం పడుతుందని తెలిపింది. సాక్ష్యాలు, ఆధారాలను తారుమారు చేసే అవకాశం ఉందని పేర్కొంది. ఇప్పటికే అప్రూవర్‌గా మారిన కొందరిని ఆమె బెదిరించారని.. అందుకు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని వాదనల సందర్భంగా కోర్టు దృష్టికి తీసుకువచ్చింది. మధ్యంతర బెయిల్ పిటిషన్‌ను కొట్టివేయాలని ఈడీ కోరింది. ఈ నేపథ్యంలో మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌ను తోసిపుచ్చుతూ కోర్టు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు కవిత దాఖలు చేసిన సాధారణ బెయిల్ పిటిషన్‌పై సీబీఐ ప్రత్యేక కోర్టు ఈ నెల 20న విచారణ జరపనుంది. ఢిల్లీ మద్యం కేసులో ఈడీ మార్చి 15న ఆమెను అరెస్టు చేసింది. మార్చి 26 నుంచి ఆమె తీహార్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.

Also Read : Supreme Court of India: యూ ట్యూబర్ అరెస్ట్ పై సుప్రీం కోర్టు ఆగ్రహం !

Leave A Reply

Your Email Id will not be published!