Tea Time Uday Srinivas: కాకినాడ పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్ధిగా జనసేన నేత, టీ టైం అధినేత ఉదయ్ !

కాకినాడ పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్ధిగా జనసేన నేత, టీ టైం అధినేత ఉదయ్ !

Tea Time Uday Srinivas: కాకినాడ పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్ధిగా జనసేన యువ నేత, టీ టైం అధినేత తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పోటీ చేస్తారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. ఉదయ్ తనకోసం, పార్టీ కోసం ఎంతో త్యాగం చేసారని… కాబట్టి భారీ మెజార్టీతో గెలిపించాలని కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. అయితే మోదీ, అమిత్ షా తనను ఎంపీగా పోటీ చేయమంటే మాత్రం ఆలోచిస్తానన్నారు. అప్పుడు తాను కాకినాడ పార్లమెంట్ కు పోటీ చేసి… ఉదయ్ ను పిఠాపురం అసెంబ్లీ స్థానంలో పోటీకు దించుతామని స్పష్టం చేసారు.

Tea Time Uday Srinivas Join in Politics

మంగళగిరిలోని పార్టీ కేంద్రకార్యాలయంలో పిఠాపురం నియోజకవర్గ నేతలతో నిర్వహించిన సమావేశంలో పవన్‌ కళ్యాణ్(Pawan Kalyan) ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. గాజువాక, భీమవరం, పిఠాపురం మూడు నియోజకవర్గాలు తనకు మూడు కళ్ల లాంటివని అన్నారు. తన గెలుపు కోసం ఆలోచన చేయకుండా… రాష్ట్రం కోసం ఆలోచన చేశానని తెలిపారు. ‘‘ శ్రీపాద శ్రీ వల్లభుడి కటాక్షంతో మనకి మంచే జరుగుతుంది. పిఠాపురం నియోజకవర్గాన్ని నా స్వస్థలంగా మార్చుకుంటాను’’ అని అన్నారు. నేను ఎక్కడ పుట్టినా.. ఎక్కడ పెరిగినా… ఇక నుంచి పిఠాపురం నుంచే ఏపీ భవిష్యత్ దశ దిశా మార్చేలా చేస్తాను’’ అని పవన్ కల్యాణ్ అన్నారు. ‘మిథున్ రెడ్డి అక్కడ బాగా తిరుగుతున్నారుగా.. మీకేమైనా బంధువులు అవుతారా’ అని ఒక నాయకుడిని పవన్ కళ్యాణ్ సరదాగా ప్రశ్నించారు. పిఠాపురం నుంచి పోటీ చేయాలని చాలా మంది గతంలోనే ఆహ్వానించారని గుర్తుచేశారు. ఇప్పుడు ఇక్కడి నుంచి పోటీ చేసే అవకాశం రావడం తన అదృష్టమని అన్నారు. పిఠాపురంలో కులాల ఐక్యత జరగాలి… కాపులు పెద్దన్న పాత్ర పోషించాలని భావించేవాడినని అన్నారు.

జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళగిరి ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో తాను పిఠాపురం అసెంబ్లీ స్థానంలో పోటీ చేస్తున్నట్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ప్రకటించారు. దీనితో పిఠాపురం టిక్కెట్టు ఆశిస్తున్న ఎస్.వి.ఎస్.ఎన్ వర్మ అభిమానులు, టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పై దుర్భాషలాడారు. అయితే నష్ట నివారణా చర్యల్లో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు… వర్మను పిలిపించి బుజ్జగించడంతో ఆయన మెత్తబడ్డారు. అంతేకాకుండా తన రాజకీయ భవిష్యత్, నియోజకవర్గ అభివృద్ధికి చంద్రబాబు నుండి హామీ లభించిందని… పవన్ కళ్యాణ్ గెలుపే లక్ష్యంగా పనిచేస్తానని వర్మ తెలిపారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు మరోసారి సంచలనంగా మారాయి.

Also Read : Taranjit Singh Sandhu : బీజేపీలో చేరిన భారత మాజీ రాయబారి తరణ్ జిత్ సింగ్ సంధు

Leave A Reply

Your Email Id will not be published!