YS Jagan: రాయలసీమ నుండి ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర ! ప్రొద్దుటూరులో తొలి బహిరంగ సభ !

రాయలసీమ నుండి ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర ! ప్రొద్దుటూరులో తొలి బహిరంగ సభ !

YS Jagan: వైసీపీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఎన్నికల ప్రచారానికి సిద్ధం అయ్యారు. ఈ నెల 27వ తేదీ నుంచి ‘మేమంతా సిద్ధం’ పేరుతో బస్సుయాత్ర ద్వారా తొలి విడత ఎన్నికల ప్రచారం ప్రారంభించబోతున్నారు. ఈ బస్సు యాత్ర రాయలసీమ నుంచే యాత్ర ప్రారంభిస్తారని పార్టీ వర్గాలు ధృవీకరించాయి. బస్సు యాత్ర ప్రారంభానికి ముందు… ఇడుపులపాయలో వైఎస్సార్‌ ఘాట్‌ ను సీఎం జగన్‌ సందర్శిస్తారు. దివంగత నేత వైఎస్సార్‌కు నివాళులర్పించిన అనంతరం అక్కడి నుంచి బస్సు యాత్రను మొదలుపెడతారు. ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ద్వారా సీఎం జగన్‌ పులివెందుల, కమలాపురం నియోజకవర్గాల మీదుగా ప్రొద్దుటూరుకు చేరుకుంటారు. ప్రొద్దుటూరులోనే తొలి బహిరంగ సభను నిర్వహిస్తారు. కడప పార్లమెంట్‌ స్థానం పరిధి నుంచి లక్ష మంది ఈ సభకు హాజరు కావొచ్చని వైఎస్సార్‌సీపీ అంచనా వేస్తోంది.

YS Jagan Comment

ఇక.. ఆ మరుసటి రోజు అంటే 28న నంద్యాల, 29న కర్నూలు, 30న హిందూపురం పార్లమెంటరీ స్థానాల పరిధిలో ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర కొనసాగనుందని వైఎస్సార్‌సీపీ వర్గాలు వెల్లడించాయి. అలాగే సిద్దం సభలు జరిగిన చోట్ల.. బస్సు యాత్ర, బహిరంగ సభలు ఉండవని స్పష్టం చేసింది.
పూర్తి రూట్ మ్యాప్‌, సీఎం జగన్‌(YS Jagan) ఎన్నికల ప్రచారం షెడ్యూల్‌ ను పార్టీ కేంద్ర కార్యాలయం త్వరలో విడుదల చేయనున్నారు. ఇంకోపక్క బస్సు యాత్ర ప్రకటన నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ శ్రేణుల్లో జోష్‌ నెలకొంది. యాత్రలో హుషారుగా పాల్గొనేందుకు మేమంతా సిద్ధం అంటూ సోషల్‌ మీడియా వేదికగా మద్దతు ప్రకటిస్తున్నారు.

Also Read : Tea Time Uday Srinivas: కాకినాడ పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్ధిగా జనసేన నేత, టీ టైం అధినేత ఉదయ్ !

Leave A Reply

Your Email Id will not be published!