Startups India : భారత్ లో 72,993 స్టార్టప్ ల హవా
2016లో 471 నుంచి పెరిగిన అంకురాలు
Startups India : భారత దేశంలో స్టార్టప్ ల సంఖ్య రోజు రోజుకు గణనీయంగా పెరుగుతున్నాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి సోమ్ ప్రకాష్ వెల్లడించారు.
2016లో 471 అంకురాలు ఏర్పాటైతే 2022 జూలై నాటికి 72,993కి భారీగా పెరిగాయని తెలిపారు. ఏకంగా 15,400 శాతం పెరిగిందన్నారు కేంద్ర మంత్రి.
తమ ప్రభుత్వం స్టార్టప్(Startups India) ల ఏర్పాటుకు తోడ్పాటు ఇస్తోందన్నారు. ఆర్థిక వృద్దిని మరింత ముందుకు తీసుకు వెళ్లేందుకు , వ్యవస్థాపకతకు మద్దతు ఇచ్చే పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలను కల్పించేందుకు ఇవి దోహద పడతాయని చెప్పారు.
బలమైన పర్యావరణ వ్యవస్థను నిర్మించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం 2016 జనవరి 16న స్టార్టప్ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించిందన్నారు.
ఇదిలా ఉండగా రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. డిపార్ట్ మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ 56 విభిన్న రంగాలలో విస్తరించి ఉన్న స్టార్టప్ లను గుర్తించిందన్నారు.
ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ , రోబోటిక్స్ , ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అనలిటిక్స్ , మొదలైన అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలకు సంబంధించిన రంగాలలో 4,500 కంటే ఎక్కువ స్టార్టప్ ల్ని గుర్తించడం జరిగిందని స్పష్టం చేశారు.
విజయవంతమైన స్టార్టప్ లు గా ఆలోచనలు, ఆవిష్కరణలను పెంపొందించడం జరిగిందన్నారు. నిధి కింద వ్యవస్థాపకత కోసం ఎంచుకునే విద్యార్థులకు ఫెలోషిప్ లను అందించడం నుండి విభిన్న కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు.
ఈఐఆర్ కింద ఔత్సాహిక ఇన్నోవేటర్లను ప్రోత్సహిస్తోంది కేంద్రం. బయో టెక్నాలజీ రంగానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తోంది. వ్యవసాయ రంగంలో కూడా స్టార్టప్ లను ప్రోత్సహిస్తోంది.
Also Read : పాలిటిక్స్ లోకి రావాలని అనుకున్నా..కానీ