లా అండ్ ఆర్డ‌ర్ కు భంగం క‌లిగిస్తే తాట తీస్తాం

టీచ‌ర్ల‌పై దాడుల‌కు పాల్ప‌డ‌డం దారుణం

అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇవాళ విజ‌య‌వాడ‌లో శాంతియుతంగా త‌మ స‌మ‌స్య‌ల ప‌రిష్క‌రించాల‌ని కోరుతూ శాప్ కార్యాల‌యానికి వెళ్లిన టీచ‌ర్ల‌పై వైసీపీ జ‌గ‌న్ బ్లేడ్ బ్యాచ్ లు దాడుల‌కు పాల్ప‌డ‌డాన్ని తీవ్రంగా ప‌రిగ‌ణిస్తున్నామ‌న్నారు. డీఎస్సీ స్పోర్ట్స్ కోటా టీచర్లపై వైసీపీ దాడులపై స్పందించారు. ప్ర‌జాస్వామ్యంలో ఇలాంటి దాడుల‌కు తావు లేద‌న్నారు. డీఎస్సీ ఉద్యోగాలు తమ కష్టార్జితమని టీచర్లంతా నినదిస్తున్నారని పేర్కొన్నారు. ఫేక్ పార్టీ అందరినీ ఫేక్ అంటే సహించేది లేదని విజయవాడలో స్పోర్ట్స్ టీచర్లు ఆందోళన చేశార‌న్నారు. టీచర్లపై దాడులు చేస్తే చూస్తూ ఊరుకోం. చర్యలు తీసుకుంటామ‌ని పేర్కొన్నారు సీఎం. జారీ చేసిన డీఎస్సీ నోటిఫికేషన్లలో అవినీతే జరగదు. నా హాయంలో ఎప్పుడూ పేపర్ లీక్ కాలేద‌ని ప్ర‌క‌టించారు. ఏనాడూ ఎవ‌రూ త‌ప్పు ప‌ట్టిన దాఖలాలు లేవ‌న్నారు. త‌న ఇన్నేళ్ల రాజ‌కీయ జీవితంలో ఇలాంటి బ్లేడ్ బ్యాచ్ లు, రౌడీ మూక‌ల‌ను చూడ‌లేద‌న్నారు .

నియామకాలు జరిగిన ఏడాది తర్వాత ఇప్పుడు లేనిపోని దుష్ప్రచారం చేస్తూ బురద జల్లుతున్నారని మండిప‌డ్డారు సీఎం. కర్నూలు కొండారెడ్డి బురుజు, విజయవాడలో అంబేద్కర్ విగ్రహం, విశాఖలో సముద్రం ఒడ్డున దుష్ప్రచారాన్ని తిప్పడికొడుతూ టీచర్లు గర్జించారని, వారిని తాను అభినందిస్తున్న‌ట్లు చెప్పారు. ఫేక్ పేపర్ సాక్షికి చెందిన రిపోర్టర్ ఓ ఉపాధ్యాయుడిపై దాడి చేశారంటే… వైసీపీ మూకలు ఎంతకు బరితెగించాయో అర్థం చేసుకోవాల‌న్నారు. ఇలాంటి వాళ్లను ఇంకా ఉపేక్షించాలా..? వీరిలాగే కొనసాగితే ఆస్తులకు ఆడబిడ్డలకు రక్షణ ఉంటుందా..? అని ప్ర‌శ్నించారు. అసెంబ్లీకి వచ్చి చర్చిస్తే సాక్ష్యాధారాలతో చూపించి వారి నోళ్లూ మూయిస్తాం అన్నారు చంద్ర‌బాబు నాయుడు. చట్టబద్దంగా జరిగిన ప్రక్రియపై అవసరమైతే కోర్టులకు వెళ్లొచ్చు… కానీ దాడులేంటీ…? ఉపాధ్యాయులపై రౌడీలను ఎగదొయడమేంటీ..? అని ఫైర్ అయ్యారు.

2019-24 మధ్య రాష్ట్రంలో విధ్వంసం జరిగింది. రాష్ట్రానికి అది మామూలు నష్టం కాదు. నాటి పాలనలో పాలకులే రౌడీయిజం చేశారు, దారుణాలకు పాల్పడ్డారన్నారు. కుప్పం వస్తే నన్ను కూడా ఇబ్బందులు పెట్టారు.. దౌర్జన్యాలకు దిగార‌న్నారు. ఓడిపోయిన తర్వాత కూడా చంపడానికైనా చావడానికైనా సిద్దం అంటూ రౌడీయిజం చేస్తున్నారని మండిప‌డ్డారు. రౌడియిజం చేసే వారి తోక కత్తిరిస్తాం. రౌడీలను విధ్వంసకారులను తరిమి కొట్టే సత్తా కుప్పానికి ఉంద‌న్నారు.

Leave A Reply

Your Email Id will not be published!