IND vs ENG 3rd T20 : సూర్య సెంచరీ చేసినా తప్పని ఓటమి
ఉత్కంఠ పోరులో ఇంగ్లండ్ విక్టరీ
IND vs ENG 3rd T20 : ఇంగ్లండ్ తో జరిగిన టి20 మ్యాచ్ లో ఉత్కంఠ భరిత విజయాన్ని నమోదు చేసింది ఆతిథ్య జట్టు. ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టు 7 వికెట్లు కోల్పోయి 215 పరుగులు చేసింది.
216 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు(IND vs ENG 3rd T20) చివరి దాకా పోరాటం చేసింది. కానీ ఫలితం లేక పోయింది. భారత జట్టులో కొంత కాలం తర్వాత ఎంట్రీ ఇచ్చిన సూర్య కుమార్ యాదవ్ సంచలన ఇన్నింగ్స్ ఆడాడు.
సెంచరీతో చెలరేగాడు. కానీ ఫలితం లేక పోయింది. భారత్ కు పరాజయం వరించింది. ఏకంగా యాదవ్ 117 పరుగులు చేశాడు. దీంతో మూడో టి20 మ్యాచ్ లో 17 పరుగుల తేడాతో ఇంగ్లండ్ గ్రాండ్ విక్టరీ సాధించింది.
టీమిండియా మూడు వికెట్లు కోల్పోయి 31 పరుగులు చేసింది. అనంతరం మైదానంలోకి వచ్చిన సూర్య కుమార్ యాదవ్(Surya Kumar Yadav) , శ్రేయస్ అయ్యర్ నాలుగో వికెట్ కు 119 పరుగులు చేశారు.
చివరి వరకు జట్టును తీసుకు రావడంలో కీలక పాత్ర పోషించారు. చివరి ఓవర్ దాకా వచ్చినా ఆఖరులో సూర్య కుమార్ యాదవ్ వెనుదిరగడంతో మ్యాచ్ ఇంగ్లండ్ వైపు మళ్లింది.
క్రిస్ జోర్డాన్ ఆఖరి ఓవర్ లో రెండు వికెట్లు పడగొట్టి భారత్ పతనాన్ని శాసించాడు. అంతకు ముందు జోస్ బట్లర్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
డేవిడ్ మలన్ సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. 77 రన్స్ చేశాడు. లియామ్ లివింగ్ స్టోన్ 42 పరుగుగలు చేశాడు. విచిత్రం ఏమిటంటే మరోసారి ముచ్చటగా మూడోసారి విరాట్ కోహ్లీ నిరాశ పరిచాడు.
Also Read : చండీమాల్ సెంచరీ లంక భారీ స్కోర్