CM KCR : కుండపోత వర్షం అప్రమత్తత అవసరం
అలర్ట్ గా ఉండాలని సీఎం కేసీఆర్ ఆదేశం
CM KCR : ఎడ తెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని పలు జిల్లాలలో వర్షాలు ముంచెత్తాయి. ఎడ తెరిపి లేకుండా కురుస్తున వర్షాల తాకిడికి జన జీవనం స్తంభించి పోయింది.
ఎక్కడ చూసినా నీళ్లే అగుపిస్తున్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. రహదారులపై నీరు నిలిచి పోయింది. చెరువులు నిండి పోయి అలుగులు పారుతున్నాయి.
వాతావరణ కేంద్రం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. లోతట్టు ప్రాంతాలలో ఉన్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించింది.
ఇదిలా ఉండగా జూలై 22 దాకా 28.58 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా ఏకంగా 50.58 సెంటీమీటర్ల వర్ష పాతం నమోదైంది.
శని, ఆదివారాలలో భారీగా వర్షాలు కురుస్తాయని అంతా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) హెచ్చరించారు. ఎడ తెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల తాకిడికి సహాయక చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.
ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో వర్షాలు, వరదల పరిస్థితిపై సీఎం సమీక్ష చేపట్టారు. లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని స్పష్టం చేశారు సీఎం కేసీఆర్(CM KCR).
కృష్ణా, గోదావరి నదుద్లో వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని అలర్ట్ గా ఉండాలని ఆదేశించారు. అంతే కాకుండా కడెం ప్రాజెక్టు, మేడిగడ్డ, అన్నారం పంపు హౌజ్ లకు నష్టం వాటిల్లింది.
దీనిపై కూడా సీఎం ఆరా తీసినట్లు సమాచారం. ఇదిలా ఉండగా హైదరాబాద్ ను వర్షం ముంచెత్తింది. హిమాయత్ సాగర్ , ఉస్మాన్ సాగర్ , హుస్సేన్ సాగర్ నిండు కుండలా మారాయి.
Also Read : జోరు వాన తడిసి ముద్దైన తెలంగాణ
