Rahul Gandhi : వృద్దులపై కేంద్రం వివ‌క్ష త‌గ‌దు – రాహుల్

టికెట్ల‌పై రాయితీ ఎందుకు ఇవ్వ‌రని ప్ర‌శ్న

Rahul Gandhi : కాంగ్రెస్ మాజీ చీఫ్ , వాయనాయుడు ఎంపీ రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు కేంద్ర స‌ర్కార్ పై. మ‌రోసారి మోదీని టార్గెట్ చేశారు రాహుల్ గాంధీ. కేవ‌లం ప్ర‌చారం కోసం రూ. 911 కోట్లు ఖ‌ర్చు చేశార‌ని ఆరోపించారు.

కొత్త విమానాల కోసం రూ. 8,400 కోట్లు, పెట్టుబ‌డిదారీ స్నేహితుల‌కు ప‌న్ను మినహాయింపు కింద రూ. 1,45,000 కోట్లు ఇచ్చిన మోదీ ప్ర‌భుత్వం ఎందుక‌ని వృద్దుల‌కు రైలు టికెట్ల‌లో రాయితీ ఇవ్వ‌డానికి నిధులు లేవా అని ప్ర‌శ్నించారు.

రూ. 1,500 కోట్లు లేవ‌ని చెప్ప‌డం దారుణంగా ఉంద‌న్నారు. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను గాలికి వ‌దిలేసిన మోదీకి త‌గిన రీతిలో బుద్ది చెప్ప‌డం ఖాయ‌మ‌న్నారు.

ఇప్ప‌టికే ప్ర‌భుత్వ సంస్థ‌ల‌ను నిర్వీర్యం చేసి అమ్మ‌కానికి లేదా లీజుకు పెట్టిన ఘ‌న‌త బీజేపీ ప్ర‌భుత్వానికి ద‌క్కుతుంద‌న్నారు రాహుల్ గాంధీ(Rahul Gandhi). జీఎస్టీ పేరుతో ప్ర‌జ‌లు నిత్యం వాడే నిత్యావ‌స‌రాల‌పై కోలుకోలేని దెబ్బ కొట్టార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

ముంద‌స్తుగా ప్యాక్ చేసిన ఆహార ప‌దార్ధాల‌పై కూడా 5 శాతం ప‌న్ను విధించ‌డం దారుణ‌మ‌ని పేర్కొన్నారు. ఎవ‌రైనా న‌ష్టాల్లో ఉన్న సంస్థ‌ల‌ను బ‌లోపేతం చేసేందుకు చ‌ర్య‌లు తీసుకుంటారు కానీ ప్ర‌స్తుతం బీజేపీ మోదీ ప్రభుత్వం అమ్మ‌కానికి పెట్ట‌డం దారుణ‌మ‌న్నారు.

కేంద్రంలో కొలువు తీరిన ప్ర‌భుత్వం ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మారింద‌ని రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఆరోపించారు. ఇప్ప‌టికే పెట్టుబ‌డిదారులు, కంపెనీల‌కు వ‌త్తాసు ప‌లుకుతూ ప్ర‌జ‌ల ఇబ్బందుల‌ను గాలికి వ‌దిలి వేశారంటూ మండి ప‌డ్డారు.

ఇప్ప‌టికైనా ప్ర‌భుత్వం త‌ప్పు తెలుసుకుని వెంట‌నే రాయితీ నిధులు మంజూరు చేయాల‌ని డిమాండ్ చేశారు.

Also Read : ఇది ట్రైల‌ర్ మాత్ర‌మే సినిమా ఇంకా ఉంది

Leave A Reply

Your Email Id will not be published!