Samantha Ruth Prabhu : సమంత కామెంట్స్ కలకలం
డబ్బులిచ్చినందుకే టాప్ లో నిలిచా
Samantha Ruth Prabhu : సినీ ఇండస్ట్రీలో మోస్ట్ పాపులర్ హీరోయిన్ గా పేరొందారు నటి సమంత రుతు ప్రభు. గౌతం వాసుదేవ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ఏం మాయ చేశావే మూవీ ఆమెకు అద్భుతమైన ఆదరణ లభించింది.
ఇదే సినిమాలో నటించిన నాగ చైతన్యతో లవ్ లో పడి పోయింది. ఆ తర్వాత ప్రేమ పెళ్లిగా మారింది. చివరకు విడాకుల దాకా వచ్చింది. ఏమైందో ఏమో కానీ సమంత నాగార్జున ఇంటిని ఒక జైలుగా భావించింది.
చాలా మంది విడి పోయాక సినిమాలకు సంబంధించి అవకాశాలు రావని అనుకుంటారు. కానీ ఊహించని రీతిలో నటి సమంతకు(Samantha Ruth Prabhu) లెక్కలేనన్ని అవకాశాలు వస్తున్నాయి.
ఇక ఓ వైపు నటిస్తూనే మరో వైపు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటారు. ఎప్పటికప్పుడు అప్ డేట్స్ ఇస్తూ హల్ చల్ చేస్తుంటారు. సమంతకు లెక్కలేనంత మంది ఫాలోవర్స్ , ఫ్యాన్స్ ఉన్నారు.
అన్ని రకాల పాత్రలు చేస్తూ విమర్శలు, ప్రశంసలు పొందుతున్నారు సమంత. ఇటీవలే బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ ప్రోగ్రామ్ లో సమంత చేసిన కామెంట్స్ కలకలం రేపాయి.
అవి నెట్టింట్లో వైరల్ గా మారాయి. నాగ చైతన్య మీ భర్త అంటే కాదు తను మాజీ భర్త అంటూ రిప్లై ఇచ్చింది. ఇదే సమయంలో ఓ సంస్థ తనను టాప్ హీరోయిన్ గా నిలబెట్టిందని దీనికి తాను సదరు సంస్థకు డబ్బులు ఇచ్చానని కుండ బద్దలు కొట్టింది.
దీంతో రేటింగ్ తో పాటు ర్యాంక్ ప్రకటించిన ఆర్ మ్యాక్స్ సంస్థ ఇప్పుడు చిక్కుల్లో పడింది. ఏది ఏమైనా ధైర్యానికి మారు పేరు సమంత.
Also Read : అన్నీ ఉన్నా శాంతి లేదని ‘తలైవా’ ఆవేదన