Telangana Comment : రాజ్ భ‌వ‌న్ వ‌ర్సెస్ ప్ర‌గ‌తి భ‌వ‌న్

గ‌వ‌ర్న‌ర్ కామెంట్స్ క‌ల‌కలం

Telangana Comment : తెలంగాణ‌లో మ‌రోసారి గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర రాజ‌న్ చేసిన కామెంట్స్(Telangana Comment)  క‌ల‌క‌లం రేపుతున్నాయి. నూత‌న రాష్ట్ర‌ప‌తిగా కొలువు తీరిన ద్రౌప‌ది ముర్ము ప్ర‌మాణ స్వీకారోత్స‌వానికి హాజ‌రైన గ‌వ‌ర్న‌ర్ షాకింగ్ కామెంట్స్ చేశారు.

భారీ వ‌ర్షాలు తెలంగాణ‌ను ముంచెత్తుత‌న్నాయి. ఈ త‌రుణంలో సాయం చేయాల్సిన స‌ర్కార్ వ‌ర‌ద‌ల పేరుతో రాజ‌కీయం చేస్తోంద‌న్నారు.

ఓ వైపు సీఎం విమానంలో వ‌ర‌ద ప్రాంతాల‌ను సంద‌ర్శిస్తే రాష్ట్రానికి ర‌క్ష‌ణ క‌వ‌చంగా ఉన్న త‌మిళి సై సౌంద‌ర రాజ‌న్ సాధార‌ణ ప్ర‌యాణికురాలి లాగా ఎలాంటి ప్రోటోకాల్ లేకుండానే రైలులో ప్ర‌యాణం చేశారు.

వ‌రద ప్రాంతాల‌ను సంద‌ర్శించారు. బాధితుల‌కు భ‌రోసా క‌ల్పించారు. దీంతో పెద్ద ఎత్తున రాద్దాంతం చోటు చేసుకుంది. గ‌త కొంత కాలం నుంచీ ఉప్పు నిప్పు లాగా మారింది త‌మిళి సై సీఎం కేసీఆర్ మ‌ధ్య వ్య‌వ‌హారం.

రోజు రోజుకు ఇద్ద‌రి మ‌ధ్య అగాధం ఏర్పడింది. చాలా సంద‌ర్భాల‌లో గ‌వ‌ర్న‌ర్ అన్న ప‌ద‌వికి విలువ లేకుండా మాట‌ల తూటాలు పేల్చారు గులాబీ శ్రేణులు .

కానీ గ‌వ‌ర్న‌ర్ మాత్రం తాను రాజ్ భ‌వ‌న్ కి ప‌రిమితం కాన‌ని, తాను ప్ర‌జ‌ల మ‌నిషిన‌ని చాటుకున్నారు. ఇదే విష‌యాన్ని స్పష్టం చేశారు త‌మిళిసై సౌంద‌ర రాజ‌న్.

మొత్తంగా రాజ‌కీయ వ‌ర్గాల‌లోనే కాదు రాష్ట్ర ప్ర‌జ‌ల్లో ఇప్పుడు రాజ్ భ‌వ‌న్ వ‌ర్సెస్ ప్ర‌గ‌తి భ‌వ‌న్ గా మార‌డం మాత్రం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

Also Read : వ‌ర‌ద‌ల‌పై రాజ‌కీయం చేయొద్దు – త‌మిళిసై

Leave A Reply

Your Email Id will not be published!