M Appavu Speaker : త‌మిళ‌నాడు స్పీక‌ర్ కామెంట్స్ క‌ల‌క‌లం

వివాదాస్ప‌దం చేసిన భార‌తీయ జ‌న‌తా పార్టీ

M Appavu Speaker : త‌మిళ‌నాడు రాష్ట్ర అసెంబ్లీ స‌భా ప‌తి (స్పీక‌ర్ ) అప్పావు(M Appavu Speaker) గ‌తంలో చేసిన కామెంట్స్ ఇప్పుడు వివాదాస్ప‌దం అయ్యాయి. ఏ మాత్రం చాన్స్ చిక్కినా దానిని రాజ‌కీయంగా వాడుకునేందుకు భార‌తీయ జ‌నతా పార్టీ రెడీగా ఉంటుంది.

దానికి వాట్సాప్ యూనివ‌ర్శిటీ అని కూడా ఉంది. సోష‌ల్ మీడియాలో బీజేపీ ప‌రుగులు తీస్తోంది. దానిని ఆప‌డం ఏ పార్టీకి సాధ్యం కావ‌డం లేదు. తాజాగా డీఎంకే కు చెందిన స్పీక‌ర్ చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు త‌మిళ‌నాడులో తీవ్ర దుమారాన్ని రేపాయి.

అగ్నికి ఆజ్యం పోసే ప‌నిలో బీజేపీ బిజీగా ఉందంటూ డీఎంకే శ్రేణులు మండి ప‌డుతున్నాయి. ఇంత‌కూ స్పీక‌ర్ ఏమ‌న్నారంటే కాథ‌లిక్ క్రైస్త‌వులు , క్రైస్త‌వ ఫాద‌ర్లు సామాజిక న్యాయం, ద్రావిడ న‌మూనా ప్ర‌భుత్వానికి ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని పేర్కొన్నారు.

ఒక నెల రోజుల కింద‌ట ఎం. అప్పావు తిరుచిరాప‌ల్లిలో ఈ వ్యాఖ్య‌లు చేశారు. అంతే కాకుండా మ‌రో అడుగు ముందుకేసి త‌మిళ‌నాడు రాష్ట్ర అభివృద్ధికి క్రిస్టియ‌న్లే కార‌ణ‌మ‌ని , క్యాథ‌లిక్ క్రైస్త‌వులు లేకుండా త‌మిళ‌ణాడు ఏనాడో బీహార్ రాష్ట్రంగా మారి ఉండేద‌ని వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు.

గ‌త నెల జూన్ 28న ఎం. అప్పావు, డీఎంకే ఎల్ఎంఏ ఇనిగో ఇరుద‌య‌రాజ్ తిరుచిరాప‌ల్లిలోని సెయింట్ పాల్ శ‌తాబ్ది ఉత్స‌వాల్లో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా స్పీక‌ర్ ఎం. అప్పావు ప్ర‌సంగించారు.

ఇవాళ నేను ఈ స్థాయికి ఎద‌గ‌డానికి ప్ర‌ధాన కార‌ణం క్యాథ‌లిక్ ఫాద‌ర్లు, సిస్ట‌ర్స్ మాత్ర‌మేన‌ని అన్నారు. త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం మీ ప్ర‌భుత్వం. దీనిని మీరు త‌యారు చేశార‌న్నారు అప్పావు(M Appavu Speaker).

మీరు ఎవ‌రిపైనా ఆధార ప‌డ‌వ‌ద్దు. మీ స‌మ‌స్య‌ల‌న్నింటిని జాబితా చేసి నేరుగా సీఎంకి ఇవ్వండ‌న్నారు. ఆయ‌న దేన్నీ కాద‌న‌డ‌ని , అంతా స‌ర్దుతాడ‌ని తెలిపారు. దీనిని బీజేపీ రాద్దాంతం చేస్తోంది.

Also Read : ఇంకెంత కాలం ఉండ‌గ‌లనో చూడాలి

Leave A Reply

Your Email Id will not be published!