Ranveer Singh : రణ్ వీర్ సింగ్ పై కేసు నమోదు
న్యూడ్ ఫోటో షూట్ పై వివాదం
Ranveer Singh : కాదేదీ బూతుకు అనర్హం అన్నట్టుగా తయారైంది. సోషల్ మీడియా వచ్చాక. నెట్ కనెక్టివిటీ పెరిగాక ఎవరు ఏం చేస్తున్నారో ఏం చూస్తున్నారో తెలియని పరిస్థితి నెలకొంది.
దీంతో ఒకరి తర్వాత మరొకరు పోటీ పడి తమ దేహాలను బాహాటంగా ప్రదర్శించేందుకు సై అంటున్నారు. లైగర్ సినిమా ప్రమోషన్ లో బాగంగా హీరో విజయ్ దేవరకొండ తన ముందు భాగం మాత్రం కనిపించకుండ ఉండేలా ఫోటో షేర్ చేశాడు.
అది మరింత వైరల్ గా మారింది. దానిని చూసిన ఇంకో తమిళ హీరో ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాల భర్త విష్ణు విశాల్ పూర్తిగా న్యూడ్ ఫోటోస్ షేర్ చేశాడు. విచిత్రం ఏమిటంటే ఆ న్యూడ్ ఫోటోలను తీసింది ఎవరో కాదు తన భార్య గుత్తా జ్వాలేనట.
ఇదే విషయాన్ని ఆ అమ్మడు గర్వంగా చెప్పింది. ఇక తానేమీ తీసిపోనంటూ ప్రముఖ బాలీవుడ్ నటుడు రణ్ వీర్ సింగ్(Ranveer Singh) సైతం ఓ మ్యాగజైన్ కోసం పూర్తిగా నగ్నంగా ఫోజులిచ్చాడు.
అది దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించింది. వైరల్ గా మారాయి ఆ ఫోటోలు. తన నగ్న చిత్రాలను స్వంత ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశాడు.
అలా షేర్ చేయడాన్ని అభ్యంతరం వ్యక్తం చేస్తూ ముంబైకి చెందిన న్యాయవాది చౌబే చెంబూరు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
రణ్ వీర్ పై సెక్షన్ 292 (అశ్లీల విషయాలతో వ్యవహరించడం దీని పరిధిలోకి వస్తుంది ) , పబ్లిక్ మర్యాద, నైతికత సమస్యను , 293 , 509 సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ బుక్ చేశారు నటుడిపై. అంతే కాకుండా ఐటీ చట్టం లోని 67(ఎ) కింద కూడా చేర్చారు.
Also Read : విష్ణు విశాల్ న్యూడ్ ఫోటో షూట్