RGV Ranveer Singh : రణ్ వీర్ సింగ్ కు ఆర్జీవీ సపోర్ట్
వాళ్లేనా మగాళ్లు ప్రదర్శించ కూడదా
RGV Ranveer Singh : నగ్నత్వం చూసే కళ్లను బట్టి ఉంటుంది. దానిని చూడాలేనా కానీ అందులోనూ అద్భుతమైన ఆనందం దొరుకుతుంది అంటాడు ఓ సందర్భంలో సెక్స్ గురువుగా ప్రసిద్ది చెందిన ఓషో.
ఏది నగ్నత్వం ఏది బూతు అన్న దానిపై గత కొంత కాలంగా చర్చ జరుగుతూనే ఉంది. మహిళల పట్ల ఆ ఆలోచనలు ప్రతి వారిలో ఉంటాయని కానీ కొందరు బయటకు ప్రదర్శిస్తారు మరికొందరు లోలోపటే దాచుకుంటారని ఫ్రాయిడ్ చెప్పే దాకా జనం నమ్మలేదు.
తరాలు మారుతున్నాయి. అభిప్రాయాలలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ప్రత్యేకించి టెక్నాలజీ వచ్చాక, సోషల్ మీడియా హవా నడుస్తున్న ప్రస్తుత తరుణంలో వైరల్, హల్ చల్ అయ్యేందుకే జనం ఎక్కువగా ఇష్ట పడుతున్నారు.
సెలబ్రిటీలు కూడా దాని వైపు మొగ్గు చూపుతున్నారు. ఒక్కోసారి ఒక్కో ట్రెండ్ టాప్ లో ఉంటోంది. తాజాగా లైగర్ సినిమా ప్రమోషన్ లో భాగంగా విజయ్ దేవర కొండ(Vijay Deverakonda) 80 శాతం న్యూడ్ గా దిగాడు.
అది వైరల్ అయ్యింది. ఆ తర్వాత రాహుల్ ఖన్నా ఓ కంపెనీ కోసం దిగాడు. ప్రస్తుతం బాలీవుడ్ నటుడు దీపికా పదుకొనే భర్త రణ్ వీర్ సింగ్(Ranveer Singh) ఏకంగా పూర్తిగా నగ్నంగా ఓ ఇంటర్నేషనల్ మ్యాగజైన్ కోసం ఫోటో షూట్ చేశాడు.
ఆపై తన ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ పెట్టాడు. ఇది చర్చకు దారి తీసింది. ముంబైలో ఓ లాయర్ ఫిర్యాదుతో నటుడిపై కేసు నమోదైంది. దీనిపై స్పందించాడు వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ(RGV Ranveer Singh).
లింగ సమానత్వం కోసమే అలా చేశాడంటూ తెలిపాడు. మహిళలు ప్రదర్శిస్తే లేని అభ్యంతరం పురుషులు అలా చూపిస్తే తప్పేంటని ప్రశ్నించాడు ఆర్జీవీ.
Also Read : రణ్ వీర్ సింగ్ పై కేసు నమోదు
I personally applaud and I am also thrilled to see the majority applauding @RanveerOfficial ‘s new age boldness💪💪💪 ..and I hope that the same majority will applaud a woman as much if she does the same ..There has to be a GENDER EQUALITY 💐💐💐 pic.twitter.com/9kVGMrYro1
— Ram Gopal Varma (@RGVzoomin) July 26, 2022