Mayank Agarwal : ఇంత‌కీ మ‌యాంక్ ఉన్న‌ట్టా లేన‌ట్టా

పంజాబ్ కింగ్స్ కెప్టెన్సీ నుంచి ఔట్

Mayank Agarwal : మ‌యాంక్ అగ‌ర్వాల్ ఆ మ‌ధ్య‌న ఒక్క‌సారిగా వెలుగులోకి వ‌చ్చాడు. ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ (ఐపీఎల్ )(IPL) లో అనూహ్యంగా అత‌డి ప‌ర్ ఫార్మెన్స్ కార‌ణంగా పంజాబ్ కింగ్స్ ఎలెవ‌న్ మేనేజ్ మెంట్ అగ‌ర్వాల్ కు అద్భుత‌మైన అవ‌కాశాన్ని ఇచ్చింది.

ఏకంగా అత‌డిని కెప్టెన్ గా ఎంపిక చేసింది. కానీ ఆ జ‌ట్టుకు హెడ్ కోచ్ గా భార‌త క్రికెట్ మాజీ దిగ్గ‌జం అనిల్ కుంబ్లే ఉన్న‌ప్ప‌టికీ ఫాయిదా లేకుండా పోయింది. ఆట‌గాడిగా , కెప్టెన్ గా పూర్తిగా ఆశించిన మేర‌కు రాణించ లేక పోయాడు మ‌యాంక్ అగ‌ర్వాల్(Mayank Agarwal).

దీంతో సోష‌ల్ మీడియాలో తెగ ట్రోలింగ్ కొన‌సాగుతోంది మ‌యాంక్ అగ‌ర్వాల్ పై. అస‌లు మ‌నోడు ఉన్న‌ట్టా లేన‌ట్టా అంటూ కామెంట్స్ తో హోరెత్తిస్తున్నారు. దీంతో మ‌యాంక్ దీనిపై ఇంకా స్పందించ లేదు.

తాను స‌హ‌జ‌సిద్ద‌మైన ఆట‌ను ఆడేందుకు ప్ర‌య‌త్నం చేస్తానంటూ స్ప‌ష్టం చేశాడ. ఇదిలా ఉండ‌గా ఈ మొత్తం వ్య‌వ‌హారంపై తాజాగా స్పందించింది పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ మేనేజ్ మెంట్.

కొన్ని స్పోర్ట్స్ వెబ్ సైట్స్ ల‌లో ఈ వార్త గుప్పుమంటోంద‌ని ఈరోజు వ‌ర‌కు మ‌యాంక్ అగ‌ర్వాల్ విష‌యంలో తాము ఎలాంటి నిర్ణ‌యం తీసుకున్నామ‌నే దానిపై ఇంకా స్పందించ లేద‌ని స్ప‌ష్టం చేసింది.

ఆ వార్త‌ల‌తో త‌మ‌కు ఎలాంటి సంబంధం లేద‌ని పేర్కొంది. ఒక‌వేళ అదేగ‌నుక జ‌రిగితే తామే అధికారికంగా ప్ర‌క‌టిస్తామ‌ని, తెలియ చేస్తామ‌ని వెల్ల‌డించింది.

కాగా ఈసారి ఐపీఎల్ లో ఊహించ‌ని రీతిలో గుజ‌రాత్ టైటాన్స్ విజేత‌గా నిలిచింది. ర‌న్న‌ర్ అప్ గా సంజూ శాంస‌న్ (Sanju Samson) నేతృత్వంలోని రాజ‌స్థాన్ రాయ‌ల్స్ మిగిలింది.

Also Read : ఫిట్ నెస్ విష‌యంలో కోహ్లీ గ్రేట్

Leave A Reply

Your Email Id will not be published!