Shane Watson : టి20 టాప్ -5లో బాబ‌ర్ ఆజ‌మ్ టాప్

ఆసిస్ మాజీ స్టార్ షేన్ వాట్స‌న్

Shane Watson : ఆస్ట్రేలియా మాజీ స్టార్ క్రికెట‌ర్ షేన్ వాట్స‌న్(Shane Watson) షాకింగ్ కామెంట్స్ చేశాడు. వ‌ర‌ల్డ్ వైడ్ గా టి20 పొట్టి ఫార్మాట్ లో టాప్ అయిదుగురు ఆట‌గాళ్ల‌ను ఎంపిక చేశాడు.

ఇందులో భార‌త జ‌ట్టుకు చెందిన క్రికెట‌ర్ కూడా ఉండ‌డం విశేషం. అయితే ఇప్ప‌టీకీ తాను పాకిస్తాన్ కెప్టెన్ బాబ‌ర్ ఆజ‌మ్(Babar Azam) ను నెంబ‌ర్ వ‌న్ ప్లేయ‌ర్ గా ప‌రిగ‌ణిస్తాన‌ని పేర్కొన్నారు.

గ‌తంలో భార‌త జ‌ట్టు(Team India) త‌ర‌పున ఎంతో మంది ఆట‌గాళ్లు టి20లో ఆడారు. వారిలో విరాట్ కోహ్లీ, రోహిత్ శ‌ర్మ‌, కేఎల్ రాహుల్ ఉన్నారు. కానీ అనుకోని రీతిలో సూర్య కుమార్ యాద‌వ్ వ‌చ్చాడు.

బాబ‌ర్ ఆజ‌మ్ కంటే ఐసీసీ ర్యాంకింగ్స్ లో 13 పాయింట్ల దూరంలో రెండో స్థానంలో ఉన్నాడు. సూర్య భాయ్ ఆడుతున్న తీరు ప‌ట్ల ప్ర‌పంచంలోని ఇత‌ర ఆట‌గాళ్లు కూడా ప్ర‌శంసించారు.

అత‌డిని ద‌క్షిణాఫ్రికా స్టార్ ప్లేయ‌ర్ ఏబీ డివిలియ‌ర్స్ తో పోల్చారు. త‌న ఐదుగురు జాబితాలో సూర్య కుమార్ యాద‌వ్ ను చేర్చ‌డం విశేషం. త‌ను ఎంపిక చేసిన వారిలో పాకిస్తాన్ కు చెందిన బాబ‌ర్ ఆజం,

ఇండియాకు చెందిన సూర్య యాద‌వ్ , ఆస్ట్రేలియాకు చెందిన డేవిడ్ వార్న‌ర్ , ఇంగ్లండ్ కు చెందిన జోస్ బ‌ట్ల‌ర్ , పాకిస్తాన్ కు చెందిన షాహీన్ అప్రిది ని చేర్చాడు.

బాగా ఆడుతుండ‌డం వ‌ల్ల యాద‌వ్ కు రెండో స్థానం ఇచ్చాన‌ని తెలిపాడు. వార్న‌ర్ మూడో ప్లేస్ కు క‌రెక్ట్ గా స‌రి పోతాడ‌ని పేర్కొన్నాడు. ఇక బ‌ట్ల‌ర్ ఏ కాలంలోనైనా ఆడే స‌త్తా ఉన్నోడ‌ని కితాబు ఇచ్చాడు.

Also Read : ఇంత‌కీ మ‌యాంక్ ఉన్న‌ట్టా లేన‌ట్టా

Leave A Reply

Your Email Id will not be published!