Kunal Kamra : నేను మీ కంటే గొప్ప హిందువును – కమ్రా
విశ్వ హిందూ పరిషత్ కు కమెడియన్ సవాల్
Kunal Kamra : నటుడు, కమెడియన్ కునాల్ కమ్రా(Kunal Kamra) తన షోను రద్దు చేయడంపై మండిపడ్డాడు. ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ కు బహిరంగ సవాల్ చేశాడు. మహాత్మా గాంధీని కాల్చి చంపిన నాథురామ్ గాడ్సే చేసిన పని తప్పని విహెచ్ పి ఖండిచాలని డిమాండ్ చేశాడు.
ఈ దేశంలో హిందూ సంస్థలు తాము అసలైన హిందువులమని చెప్పుకుంటున్నాయని ఆరోపించారు. తాను అసలైన హిందువునని స్పష్టం చేశాడు. ఈ మేరకు బహిరంగ లేఖ రాశారు కునాల్ కమ్రా.
సెప్టెంబర్ 17 , 18 తేదీల్లో గుర్గావ్ లో తన స్టాండప్ షో ఇవ్వాల్సి ఉంది. ఆ ప్రదర్శన వద్దంటూ కొన్ని హిందూ సంస్థలు అభ్యంతరం తెలిపాయి. మితవాదుల బెదిరింపుల కారణంగా నిలిపి వేయబడ్డాయి.
గతంలో అనేక సమస్యలపై భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వాన్ని విమర్శించారు. తన పదునైన మాటలతో ఇబ్బంది పెట్టాడు కునాల్ కమ్రా(Kunal Kamra).
నేను జై శ్రీ సీతా రామ్ , జై రాధా కృష్ణ అని బిగ్గరగా , గర్వంగా జపిస్తానని చెప్పారు. మీరు నిజంగా భారతీయులైతే గాడ్సే ముర్దాబాద్ అని చెప్పండి అన్నారు.
ఇది గనుక చెప్పక పోతే మీరు హిందూ వ్యతిరేకులుగా, తీవ్రవాద మద్దతు దారులుగా భావించ బడతారని స్పష్టం చేశారు కునాల్ కమ్రా.
నేను మీ కంటే పెద్ద హిందువును. కష్టపడి సంపాదించిన రొట్టె తింటాను. ఎరినైనా బెదిరించి, భయాన్ని పంచి చెత్తతో జీవించడం పాపంగా భావిస్తానని పేర్కొన్నారు. హిందూ సంస్థలు హిందూ దేవుళ్లను అవమానించాడంటూ ఫిర్యాదు చేశారు.
Also Read : నరేంద్ర మోదీ భారతీయ ఆత్మ – ఖాడే