Varisu Movie : త‌ళ‌ప‌తి విజ‌య్ ‘వారిసు’ పోస్ట‌ర్ వైర‌ల్

విజ‌య్ అభిమానుల‌కు గుడ్ న్యూస్

Varisu Movie : త‌ళ‌ప‌తి విజ‌య్ కు త‌మిళ సినిమా రంగంలో ప్ర‌త్యేక‌మైన చోటు ఉంది. వేలాది మంది అభిమానుల‌ను క‌లిగి ఉన్నారు. విజ‌య్ , పూజా హెగ్డేతో క‌లిసి న‌టించిన బీస్ట్ ఆశించినంత మేర న‌డ‌వ‌లేదు. తాజాగా తెలుగు ద‌ర్శ‌కుడు వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో త‌ళ‌ప‌తి సినిమా చేయ‌నున్నారు.

దీపావ‌ళి విషెస్ తో గుడ్ న్యూస్ చెప్పారు ద‌ర్శ‌కుడు. ఈ మేర‌కు సోమ‌వారం పండుగ సంద‌ర్భంగా టైటిల్ ను రిలీజ్ చేశారు. ప్ర‌స్తుతం ఈ పోస్ట‌ర్ హ‌ల్ చ‌ల్ చేస్తోంది. తెలుగులో వార‌సుడిగా త‌మిళంలో వారిసుగా రాబోతోంది ఈ మూవీ(Varisu Movie). మూవీ మేక‌ర్స్ క‌ళ్లు చెదిరే లుక్స్ తో పోస్ట‌ర్ రిలీజ్ చేశారు.

అంతే కాదు విడుద‌ల తేదీ కూడా ప్ర‌క‌టించ‌డం విశేషం. వారిసు (వార‌సుడు) మూవీని 2023 జ‌న‌వ‌రి 12న సంక్రాంతి కానుకంగా ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. ప్ర‌స్తుతం విడుద‌ల చేసిన విజువ‌ల్ ట్రీట్ అదిరింది. త‌ళ‌ప‌తి విజ‌య్ తో పాటు స‌హ‌జ‌న‌టి జ‌య‌సుధ‌, ప్ర‌కాశ్ రాజ్ , ప్ర‌భు, శ్రీ‌కాంత్ , యోగి బాబు, శ‌ర‌త్ కుమార్, త‌దిత‌ర ప్ర‌ముఖ న‌టులు న‌టిస్తున్నారు.

కాగా ఈ చిత్రాన్ని తెలుగు, త‌మిళ భాష‌ల్లో తెర‌కెక్కుతోంది. ఈ చిత్రానికి ప్ర‌ముఖ నిర్మాత‌లు దిల్ రాజు, శిరీష్ ఉన్నారు. శ్రీ వేంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ , పీవీపీ బ్యాన‌ర్ పై తెర‌కెక్కిస్తున్నారు ద‌ర్శ‌కుడు పైడిప‌ల్లి వంశీ. ఇక త‌ళ‌ప‌తి విజ‌య్ కు జోడీగా ర‌ష్మిక మంద‌న్న న‌టిస్తోంది. ఎస్ఎస్ థ‌మ‌న్ సంగీతం అందిస్తున్నారు.

Also Read : హాట్ హాట్ సొగసులతో ఇష్మార్ట్ భామ నాభ నటేష్

Leave A Reply

Your Email Id will not be published!